తెలుగులో ఎన్టీఆర్ నటించిన మహర్షి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాను తమిళంలో విశాల్ నటించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో దీని గురించి టాక్ పాజిటివ్ గానే వినిపిస్తోంది. తారక్ తో పోల్చకుండా విడిగా చూస్తే విశాల్ అంచనాలు నిలబెట్టుకునేలానే చేసాడనే కామెంట్ వినిపిస్తోంది.


ఇదిలా ఉండగా టెంపర్ లో చాలా కీలకమైన క్లైమాక్స్ ని మాత్రం మార్చడం షాక్ ఇచ్చే విషయం తెలుగులో హీరో పాత్ర కోర్టులో నేరం తన మీద వేసుకున్న తర్వాత విలన్లతో కలిపి తనకు ఉరి శిక్ష పడుతుంది. కాని దర్శకుడు పూరి జగన్నాధ్ జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని దాన్ని కాస్త డ్రమాటిక్ గా మార్చి హీరో బ్రతికేలా రాసుకున్నాడు. కాని సహజత్వానికి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తమిళ దర్శకులు అయోగ్యలో మాత్రం హీరో కూడా ప్రాణ త్యాగం చేసినట్టు చూపించారు.


నలుగురికి ఉరి వేశాక విశాల్ కూడా ప్రాణాలు కోల్పోతాడు. ఇది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా తీశారు. గతంలో విజయ్ కాంత్ రమణలో హీరోకు ఉరిశిక్ష వేసే సీన్ తెలుగులో టాగోర్ గా తీసినప్పుడు చిరు కోసం వినాయక్ మార్చి తీశారు. ఇప్పుడు రివర్స్ లో మనకు సుఖాంతమైన కథను అక్కడ ట్రాజెడీ చేశారు. ఇక్కడ అయోగ్య వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మనం ఈ ట్విస్ట్ గురించి చెప్పుకోవడంలో తప్పేమీ లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: