జగపతి బాబు ఒక విలక్షణమైన నటుడు. ఒక అగ్ర హీరోగా తన కెరీర్ లో ఏన్నో విజయాలను సాధించారు అయన. హీరోగా అంతగా పేరు ప్రఖ్యాతలను సంపాదించారో ఒక తండ్రి గా, ఒక విలన్ గా ఏ పాత్రలోనైనా జీవించగల వ్యక్తీ జగపతి బాబు. జగపతి బాబు చేతిలో ఏన్నో సినిమాలు రెడీ గా ఉన్నాయి అన్నీ కూడా ప్రేక్షకులు ఏంతో ఆసక్తిగా ఏదురుచూస్తున్న సినిమాలనే చెప్పాలి.
విలన్ గా జగపతి బాబును మరో మెట్టుకు తెసుకుని వెళ్ళింది లెజెండ్ సినిమా. లెజెండ్ లో జగపతి బాబు నటనకు ఏన్నో ప్రసంశలు వచ్చాయి. రంగస్థలం, మొన్నీ మధ్య బ్లాక్ బస్టర్ అయిన మహర్షి సినిమా తో సహా ఈ సంవత్సరం జగపతి బాబు మంచి హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ బాల కృష్ణ సినిమాలో విలన్ పాత్ర లో కనిపించనున్నారు.
జై సింహ ఫేం కెఎస్ రవికుమార్ దర్శకత్వం లో తెరకేక్కబోతున్న హై వోల్టేజి సినిమా “రూలర్”. ఈ సినిమా మీద అందరికి భారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సి కళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది ఈ నెల మే 17వ తేదిన లాంచ్ కు సిద్దంగా ఉంది. సినీవర్గాల సమాచరం ప్రకారం జగపతి బాబు ఈ సినిమా లో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలిసింది.
ఒక పాత్రలో విలన్ గాను మరో రోల్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అయితే మేకర్స్ ఒక రోల్ గురిఇంచి మాత్రమే సమాచరం అందించారో రెండో రోల్ ఎలా ఉండబోతుంది అనే దానిపై వివరణ ఇవ్వలేదు.మొత్తానికి ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ గా సాగుతుందట. బాల కృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కుడా విలన్ పాత్ర లో కనిపించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: