దీపికా పదుకొనే పెళ్లి అయిన తరువాత కూడా అందాలను ఆరబోయటంలో వెనక్కి తగ్గటం లేదు. అయితే   కేన్స్ 2019 ఉత్సవాల్లో బాలీవుడ్ అందగత్తెల డామినేషన్ గురించి తెలిసిందే. మన భామల అందచందాలు.. ఫ్యాషన్ ఎలివేషన్ ముందు ప్రపంచం చిన్నబోయింది. ఇతర దేశాల నుంచి వచ్చిన ఏ భామా ఈ బ్యూటీ క్వీన్స్ కి పోటీ కానే కాదని అర్థమైంది. ముఖ్యంగా రకరకాల డిజైనర్ దుస్తుల్లో కథానాయికల ఫ్యాషన్ షో ప్రత్యేకంగా హైలైట్ అయ్యింది. 


ఈ వేడుకల్లో హీనా ఖాన్.. ప్రియాంక చోప్రా.. కంగన రనౌత్.. దీపిక పదుకొనే వంటి నాయికలు తమవైన రెడ్ కార్పెట్ విన్యాసాలతో కట్టి పడేశారు.ఇప్పటికి దీపిక మూడు రకాల డిజైనర్ డ్రెస్సుల్లో తళుకుబెళుకులు ప్రదర్శించింది. నేటి ఉదయం ఓ రెండు డిఫరెంట్ డిజైనర్ లుక్స్ ని రివీల్ చేసిన దీపిక తాజాగా మరో కొత్త లుక్ తో దుమారం రేపింది. ఈ డ్రెస్ పూర్తిగా డిఫరెంట్. పూర్తిగా పాక్షికంగా అందాల్ని ఎలివేట్ చేసేంత పలుచని వైట్ లైనింగ్ క్లాత్ తో ఈ డిజైనర్ వేర్ ని దీపిక కోసం రూపొందించారు డిజైనర్స్. 


తెలతెల్లని హంసను తలపిస్తున్న ఈ బ్యూటీ స్టన్నింగ్ అనిపించే గాగుల్స్ తో బరిలో దిగింది.ఈ మూడో లుక్ కి స్ఫూర్తి ఎవరో దీపికనే చెప్పింది. లారెంజో సెరాఫిని ది ఫిలాసఫీ పేరుతో ఈ ఔట్ ఫిట్ ని రూపొందించారు. ఇక ఆ వైట్ & వైట్ డ్రెస్ ని రకరకాల లేస్ లతో చుట్టేస్తూ డిజైన్ చేసిన విధానం మైమరిపిస్తోంది. పవర్ పింక్ హైహీల్స్.. జిమ్మీ చూ.. అండ్ రౌండ్ సన్నీస్ ..తో మార్క్ జాకబ్స్ డిజైన్ ని బాటమ్ లో ధరించింది. ఇక ఈ డిజైన్ కి తగ్గట్టే బెల్ట్ కాంబినేషన్... మేకప్ కాంబినేషన్  ఫెయిల్యూర్ లేకుండా దీపిక ఎంతో జాగ్రత్త పడింది. మొత్తానికి కేన్స్ ని దీపిక గజగజ ఒణికించిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: