కాజల్ చూపులతోనే చంపేసే అందగత్తె. అభినయమూ ఉంది. దాంతో అప్పట్లో వరస హిట్లు, స్టార్ హీరోల పక్కన చాన్సులు ఓహో అనేలా ఆమె లైఫ్ సాగింది. అయితే గత కొన్నాళ్ళుగా బ్యాక్ బెంచ్ కి పరిమితమైన ఈ అమ్మడు ఒక్క హిట్ అంటూ కలవరిస్తోంది.


ఈ నేపధ్యంలో వచ్చిన సీత మూవీ బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. కాజల్ నటన వరకూ ఒకే కానీ ఈ మూవీ రిజల్ట్ మాత్రం దారుణంగా ఉంది. పవిత్రమైన సీత పేరు పెట్టి హీరోయిన్ చేత సహజీవనం లాంటి మాటలు చెప్పించడం, బోల్డ్ టైప్ క్యారక్టర్లో సీత పాత్రను డిజైన్ చేయడం ద్వారా తేజా మొదట్లోనే ట్రాక్ తప్పేశాడని రివ్యూస్ వచ్చాయి.


దాంతో తనకు ఇచ్చిన పాత్రలో బాగా చేసి కూడా కాజల్ ఆ ఫలితాన్ని మోయాల్సివచ్చింది. ఇపుడు కాజల్ చేతిలో సరైన మూవీస్ ఏవీ  లేవు. నాగ చైతన్య మూవీ కూడా ఇపుడు ఈ రిజల్ట్ చూసిన తరువాత వెనక్కి వెళ్ళినా షాక్ అవనక్కరలేదు.


ఇక కాజల్ కి మిగిలింది సీనియర్ హీరోలే. బాలయ్యతొ  అప్పట్లో నో చెప్పిన కాజల్ ఇపుడు ఎస్ అనవచ్చు. అలాగే నాగ్, వెంకీ, వంటి సీనియర్ల పక్కన మూవీస్ చేసిన తరువాత కెరీర్ కంప్లీట్ గా క్లోజ్ అవుతుందేమో మరి. ఏది ఏమైనా చందమామగా ముందుకు వచ్చిన ఈ చిన్నది ఇపుడు గొప్ప ట్రబుల్స్ ఫేస్ చేతోంది. అవును మరి సీత కష్టాలు సీతవి.


మరింత సమాచారం తెలుసుకోండి: