ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది.  సినిమాలు చాలా వెరైటీగా తీస్తుంటాడు.  కామెడీ హీరోలతో చేసిన సినిమాలు వరసగా హిట్ కొట్టాయి.  రాజేంద్రప్రసాద్, అలీ తో చేసిన సినిమాలు విజయవంతం అయ్యాయి.  పెద్ద హీరోలతో రెండు సినిమాలు చేశాడు.  రెండు భారీ ప్లాప్ అయ్యాయి.  బాలకృష్ణతో టాప్ హీరో, నాగార్జునతో చేసిన వజ్రం సినిమాలు పరాజయం పాలయ్యాయి.  దీంతో పెద్ద హీరోల జోలికి వెళ్లకుండా తన సినిమాలు చేసుకున్నాడు.  


ఇదిలా ఉంటె, అలీని హీరోగా పరిచయం చేస్తూ తీసిన యమలీల సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.  కమెడియన్ గా ఉన్న అలీ ఈ సినిమా తరువాత హీరోగా మారిపోయారు.  అయితే, యమలీల సినిమా కథ అలీ కోసం రాసుకుంది కాదట.  మహేష్ కోసం కథను రెడీ చేసుకున్నాడు.  అప్పటికే కృష్ణతో ఎస్వీ కృష్ణారెడ్డి నెంబర్ 1 సినిమా చేశాడు.  మంచి విజయం సాధించింది.  ఇదే సమయంలో యమలీల కథను వినిపించారు.  


మహేష్ ను హీరోగా పెట్టి చేయాలని ఎస్వీ కృష్ణారెడ్డి తపన.  కథ బాగా ఉంది.  కానీ, ప్రస్తుతం మహేష్ చదువుకుంటున్నాడని, ఇప్పుడు కుదరదని కృష్ణ చెప్పేశాడు.  దీంతో మహేష్ కు ఆ ఛాన్స్ మిస్ అయ్యింది.  కథ రెడీగా ఉండటంతో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆ కథను అలీకి చెప్పి హీరోగా పరిచయం చేశాడు.  ఫాంటసీగా సాగిన కథ ఆధ్యంతం ఆసక్తిని రేపింది.  టైమింగ్ కామెడీ...పంచ్ డైలాగులతో సినిమా సూపర్ హిట్టైంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: