బాలకృష్ణ హీరోగా 104 సినిమాలు పూర్తి చేశారు.  105 వ సినిమా ఎవరితో చేయబోతున్నారు అనే దానిపై మొన్నటి వరకు ఒక సస్పెన్స్ ఉండేది.  ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరపడింది.  బాలకృష్ణ తన 105 వ సినిమాను సీనియర్ దర్శకుడు కెఎస్ రవికుమార్ తో చేయబోతున్నారు.  దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు పూర్తయ్యాయి.  


జూన్ 12 వ తేదీన లాంఛనంగా ప్రారంభం కాబోతున్నది.  బాలకృష్ణ.. కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో సినిమా అనే సరికి ఫ్యాన్స్ భయపడుతున్నారు.  ఈ కాంబినేషన్లో సినిమా వద్దని అవసరమైతే రద్దు చేసుకోవాలని అంటున్నారు.  వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జైసింహ సినిమా పెద్దగా ఆడలేదు.  జస్ట్ యావరేజ్ గా నిలిచింది. 


అసలే బాలయ్య వరసగా రెండు ప్లాప్ లతో ఇబ్బంది ప్ ఆడుతున్నారు.  ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.  దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.  బోయపాటితో కానీ, లేదంటే ఎవరైన కొత్త దర్శకుడితో గాని సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  బాలకృష్ణ మాత్రం కెఎస్ రవికుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.  


రవికుమార్ అందించిన స్టోరీ చాలా బాగా నచ్చిందని ఇప్పటికే బాలకృష్ణ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.  రవికుమార్ తో చేయబోయే సినిమా తప్పకుండా తిరిగి తన ఇమేజ్ ను గాడిలో పడేవిధంగా చేస్తోందని అంటున్నారు బాలకృష్ణ.  మరి ఈ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: