అక్కినేని నాగార్జున నటిస్తూ నిర్మిస్తున్న మన్మధుడు సినిమాలో స్టార్ హీరోయిన్లు ఎక్కువైపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ , కీర్తి సురేష్ నటిస్తుండగా మరో ముఖ్యమైన చిన్న పాత్ర కోసం సమంత అక్కినేని నటిస్తుంది. ఈ పాత్ర నిడివి 5 నిమిషాలు మాత్రమే సినిమాలో ఉంటుంది.

ఈ సినిమాకు సమంత అక్కినేని 35 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. నిజానికి అక్కినేని నాగార్జున ఈ సినిమాకు నిర్మాత కాబట్టి కోడలు అక్కినేని సమంత ఈ సినిమాలో ఫ్రీగా నటించడానికి సిద్దమైంది. కానీ నాగార్జున దీనికి ఒప్పుకోకపోవటంతో 35 లక్షల పారితోషికం తీసుకోవటానికి ఒప్పుకుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్టిల్స్ ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ పెంచాయి.60 ఏళ్ళ వయసులో కూడా నాగార్జున మన్మధుడిలా ఉన్నాడు. ఈ సినిమాకు చి ల సౌ సినిమాతో హిట్టు కొట్టిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: