ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టైం ఎవరిదైనా నడుస్తుంది అంటే టక్కున వినబడే హీరో పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా పుణ్యమా అంటూ వరుస ఆఫర్లు స్వీకరిస్తున్న విజయ్ దేవరకొండ వరుసగా హిట్లు కొడుతూ బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తున్నారు. సౌత్ ఇండియాలో మంచి మార్కెట్ ఏర్పరుచుకొన్నాడు.


ఇటువంటి క్రమంలో విజయ్ దేవరకొండ ఇటీవల తాను చేస్తున్న సినిమాల స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్ ప్రమేయమే లేకుండా వేలు పెడుతూ డైరెక్టర్లకి తల నొప్పిగా మారుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. కొత్త దర్శకుడు భరత్ కమ్మ.. విజయ్ హీరోగా 'డియర్ కామ్రేడ్' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఏ సీన్ ఉంచాలి..? ఏది తీసేయాలనే విషయాన్ని దేవరకొండ డిసైడ్ చేస్తున్నాడట.


విజయ్ మీద నమ్మకంతో నిర్మాతలు కూడా అతడిని ఏమీ అనడం లేదట. దీంతో కొత్త దర్శకుడు భరత్ కమ్మ బాగా విసిగిపోయాడట. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు దూరంగా ఉంటున్నాడట. డైరెక్టర్ అలిగాడని విజయ్ కి అర్ధమైనా.. అదేమీ పట్టించుకోకుండా తన పని చేసుకుంటున్నాడట. మొత్తం మీద వరుస విజయాల మీద ఉన్న విజయ్ దేవరకొండ డైరెక్టర్లకి తల నొప్పిగా మారుతుండడంతో విజయ్ దేవరకొండ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: