"బాహుబలి" తో తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి.ఆయన పిలిస్తే చాలు కనీసం కథ ఏంటి అందులో తమ పాత్ర ఏంటి అని అడక్కుండా ఆయనతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందరో ఇండియన్  హీరోలు అలాంటి రాజమౌళి కథకి నో చెప్పాడు ప్రభాస్ కాకపోతే అది ఇప్పుడు కాదు 17సంవత్సరాల క్రితం అవును రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్1 ఆ సినిమా బాక్సఆఫీస్ లో పెద్ద సక్సెస్ సాధించినా పేరు మాత్రం రాఘవేంద్రరావు ఖాతాలో పడింది ,అది గమనించిన కె.విజయేంద్రప్రసాద్ గారు కొడుకు రాజమౌళి కోసం ఓ యాక్షన్ కథ సిద్ధం చేసాడు ఆ కథే "సింహాద్రి" .

మొదట సింహాద్రి కథ కోసం రాజమౌళి బృందం ప్రభాస్ ను సంప్రదించింది కానీ స్టూడెంట్ నెంబర్1 చూసిన ప్రభాస్ కి రాజమౌళి మీద నమ్మకం కలగలేదు అందుకని "సింహాద్రి" కథకు నో చెప్పాడు.

ఆ తర్వాత సింహాద్రి కథను నందమూరి బాలకృష్ణకు చెప్పడం జరిగింది కానీ అప్పటికే వరస "క్రైమ్ అండ్ పనిష్మెంట్" సినిమాలు చేస్తున్న బాలయ్య ఆ కథకు నో చెప్పాడు.దాంతో విజయేంద్రప్రసాద్,రాజమౌళి కలిసి జూ ఎన్టీఆర్ కి కథ చెప్పడం దాన్ని ఎన్టీఆర్ ఒప్పుకోవడం అలా "సింహాద్రి" ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చింది.అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు."సింహాద్రి" సినిమా చూసి మంచి అవకాశం చేతులారా పొగుట్టుకున్నానే అని అనుకున్నాను అని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కోస మెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: