నేను ఎప్పుడు చనిపోయినా అది గురువారం రోజే ! అని చెప్పి మరీ అదే రోజున మరణించింది విజయనిర్మల . సాయిబాబా అంటే బాగా నమ్మకం విజయనిర్మల కు దాంతో అదే రోజున చనిపోవడం యాదృచ్ఛికం గా జరిగింది . నిన్న అర్ధరాత్రి సడెన్ గా గుండెనొప్పి రావడంతో గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు . 


అయితే డాక్టర్లు విజయనిర్మల ని బ్రతికించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి , అయితే చనిపోయే కొద్దిసేపటి ముందు మీకేం కాదు అని డాక్టర్లు చెబుతున్నప్పుడు నేను ఎప్పుడు చనిపోయినా గురువారం రోజే అని చెప్పిందట . కట్ చేస్తే అదే నిజమయ్యింది . విజయనిర్మల ఈ లోకాన్ని విడిచి పెట్టింది ఈరోజే ….. ఈరోజే  గురువారం …… 


ఇదిలా ఉండగా, భార్య విజయనిర్మల మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన నటశేఖరుడు కృష్ణను జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఓదార్చారు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని కృష్ణ నివాసంలో ఉంచిన విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించిన పవన్.. ఆ తరవాత కృష్ణను పరామర్శించారు. ఆయనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఆయన్ని ఓదార్చారు. తల్లిని పోగొట్టుకుని బాధలో ఉన్న నరేష్‌కు పవన్ ధైర్యం చెప్పారు. 


పవన్ కళ్యాణ్‌తోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నటుడు మోహన్‌బాబు, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, నటుడు రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి, రచయిత పరుచూరి గోపాలక్రిష్ణ, మెహర్ రమేష్, చార్మి, రష్మిక మందన తదితరులు విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. విజయనిర్మల గారి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: