తెలుగులో హిట్టైన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలు ఫలించాయి. అనుకున్నట్టుగానే సినిమా హిట్ కొట్టింది. సినిమా హిట్టవ్వడమే కాదు.. ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు సాధిస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ రూ. 214 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాలీవుడ్ లో అందరు హీరోలు సోలోగా వంద కోట్లు వసూలు చేస్తుంటే.. షాహిద్ కు మాత్రం ఆ అవకాశం దొరకలేదు. కబీర్ సింగ్ సినిమాతో ఆ లోటు పూడింది. ఏకంగా 214 కోట్లు వసూలు చేసి రికార్డు సాధించింది.
లాంగ్ రన్ లో ఈ మూవీ తప్పకుండా 300 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆగష్టు 15 వరకు పెద్ద సినిమాలు లేవు. దీంతో కబీర్ సింగ్ కు ఎదురు లేకపోవచ్చు. కియారా అద్వానీకి ఈ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అమ్మడు ముద్దులతో ముంచెత్తింది.
అంతేకాదు, సందీప్ రెడ్డికి మరో అఫర్ ను తెచ్చిపెట్టింది ఈ మూవీ. టి సిరీస్ సంస్థ సందీప్ తో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యింది. సల్మాన్ లేదా మరో టాప్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అన్నట్టుగా కథను సిద్ధం చేసుకోమని చెప్పినట్టుగా సమాచారం.