ఇంతకు ముందు ఇండియన్ సినిమా అనగానే కేవలం బాలీవుడ్ అనుకునే వారు ప్రపంచ సినీ ప్రేక్షకులు కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే "బాహుబలి" అంటున్నారు అదే ప్రేక్షకులు, అంతలా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాకి చూపించాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.
తెలుగు సినిమా బడ్జెట్ ని అమాంతం పర్వత శిఖరాలకు తకించి, వసూళ్లను ఆకాశానికి తకించిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది.
దాదాపు 400కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు బాహుబలి రెండు పార్ట్ లు. ఇప్పుడు బాహుబలి చూపించిన బాటలోనే పయనిస్తున్నాయి చాలా సినిమాలు."సాహో","సైరా" లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు తెలుగు వాళ్ళు నిర్మిస్తుండటం తెలుగు సినిమా కు గర్వకారణం.
తెలుగు సినిమాని మరో మెట్టు ఎక్కించడానికి చూస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్.1500 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణాన్ని నిర్మిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ప్రైమ్ ఫోకస్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాకి దంగల్ దర్శకుడు నితీష్ తివారి, మామ్ సినిమా దర్శకుడు రవి ఉడయర్ అని ప్రకటించారు. మొత్తం మూడు భాగాలుగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పారు. అయితే ఈ భారి చిత్రాన్ని ఎప్పుడు మొదలు పెడతారు, ఇందులో నటీనటులు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: