బట్టల్లేకుండా.. నగ్నంగా సినిమాలు చేసిన హీరోయిన్లు ఇప్పటికే మన సౌత్ ఇండస్ట్రీలో రాధికా ఆప్టే లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారంతా ఒకట్రెండు సీన్లనో.. అది కూడా కథ డిమాండ్ కు తగ్గట్లు కనిపిస్తుంటారు. ఇలాంటి సీన్ల డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఆమె సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించటం ఇప్పటికే సంచలనంగా మారటమే కాదు..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రచార చిత్రాలు, ట్రైలర్స్ లో ఆమె లుక్ ఇప్పటికే సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. ఈ వారం విడుదల కానున్న ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందన్న ఉత్కంట ప్రేక్షకుల్లో బాగా పెరిగిపోతోంది. అయితే నగ్నంగా తానెందుకు నటించిన విషయం మీద మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో అమలాపాల్ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే దీనికి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.  నగ్నంగా నటించటం ఇబ్బందిగా అనిపించలేదా అంటే మెసేజ్ ఉండే సినిమా కావటం.. కథానుగుణంగా చూసినప్పుడు న్యూడిటీ అస్సలు అనిపించదని ఆమె చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది . అంతేకాదు.. సినిమా మొత్తం నగ్నంగా కనిపించను. పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే నగ్నంగా కనిపిస్తానంటూ చెప్పిన మాటతో మరోసారి ఈ సినిమా మీద చర్చ మొదలయ్యోలా చేశారు. పావుగంటకు పైనే నగ్నంగా అంటే.. సినిమాలో అదెంత ప్రాధాన్యమున్న సందర్భమో అందరికీ అర్థమైపోతుంది. పాత్ర పరంగా అలా కనిపించాల్సి ఉంటుందని..అందులో ఎలాంటి అసభ్యత ఉండదని అమల స్పష్టం చేస్తున్నారు. 

అంతేకాదు.. మళ్లీ ఇలాంటి సినిమానే చేయమంటే మాత్రం అస్సలు చేయనని తేల్చేచెప్పేసింది కూడా. కొత్తదనం కోసమే విభిన్నంగా ఉండే పాత్రను చేశానని.. ఫ్యామిలీ ఆడియన్స్ ను దూరం చేసే అవకాశం లేదని నమ్మకంగా చెబుతోంది. ఏమైనా.. సినిమా నిడివిలో పావు గంటకు పైనే న్యూడ్ గా కనిపించే పాత్ర చేయటానికి మాత్రం చాలా గట్స్ కావాలి. అది తనలో ఎంత ఉందన్న విషయాన్ని అమలాపాల్ ఆమె సినిమాతో నిరూపించుకుందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: