గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్టు లేదు పూరి జగన్ కు,పెద్ద హీరోలు ఎవరు డేట్స్ ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు అదే టైం లో హిట్ల కోసం పరితపిస్తున్నాడు యంగ్ హీరో రామ్.వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్ష కురిపిస్తుంది.

అయితే ఈ సినిమా విషయంలో సొమ్మొకడిది సోకోకడిది అనేలా ఉంది రాంగోపాల్ వర్మ పెద్దది. సినిమా విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ విజయోత్సాహంలో ఉంది అందరి కంటే ఎక్కువ రాంగోపాల్ వర్మ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఇది కేవలం పబ్లిసిటీ కోసమే రాంగోపాల్ వర్మ చేస్తున్న సందడి అని పూరి జగన్ తన శిష్యుడు అవ్వడంతో పూరి సినిమాకి కావాలనే ఈవిధంగా పబ్లివిటీ చేస్తున్నాడని, హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ సినిమాకి వెళ్ళడం, ఛార్మీని ముద్దు పెట్టుకొని ఆ ఫోటోలు నెట్ లో వైరల్ చేయడం ఇలాంటి వర్మ పబ్లిసిటీ మంత్రాలని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: