గీతగోవిందం హిట్ తరువాత విజయ్ మంచి జోష్ మీదున్నాడు.  డియర్ కామ్రేడ్ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.  ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతున్నది. ఈరోజు యూఎస్ లో ప్రీమియర్ షోలు వేయబోతున్నారు.  ఇప్పటికే ప్రీమియర్ కు సంబంధించిన టికెట్స్ సెల్ అయినట్టుసమాచారం.  


విజయ్ సినిమాలకు యూఎస్ లో క్రేజ్ ఉండటంతో.. అక్కడ సినిమా టికెట్స్ దొరకడం  కష్టంగా ఉందని తెలుస్తోంది.  పైగా గీతగోవిందం కాంబినేషన్ కావడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.  ఇటు ఈ మూవీ సౌత్ లోని అన్ని భాషల్లో రిలీజ్ కాబోతున్నది.  


తెలుగులో ఇప్పటికే హైప్ వచ్చింది.  కన్నడంలో మొదటిసారిగా విజయ్ సినిమా డబ్బింగ్ చేశారు.  అటు కేరళ, తమిళనాడులో కూడా సినిమా రిలీజ్ కాబోతున్నది.  నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో విజయ్ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  


సినిమా బాగుంది అనే టాక్ వస్తే చాలు మళ్ళీ ఈ యువహీరో వందకోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోతారు.  నోటా లా ఏదైనా తేడా వస్తే సినిమా సోయలో కూడా ఉండదు.  మరి ఈ మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: