డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కావటానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాపై క్రేజ్ పెంచడానికి విజయ్ దేవరకొండ హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, కొచ్చి నగరాల్లో ఇప్పటికే మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించాడు. ఈ సినిమాలోని ఒక పాటను తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, తెలుగులో విజయ్ దేవరకొండ పాడటం విశేషం. 
 
గీతా గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై తెలుగులో భారీగా అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ జోరుగా జరుగుతున్నట్లు సమాచారం. తమిళంలో మాత్రం ఈ సినిమాకు పోటీగా ఆరు తమిళ సినిమాలు విడుదలవుతున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ గా రష్మిక నటిస్తూ ఉండటంతో కన్నడ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు క్రేజ్ బాగా వచ్చింది. మలయాళంలో కూడా ఈ సినిమాకు క్రేజ్ బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. 
 
డియర్ కామ్రేడ్ సినిమా సూపర్ హిట్టైతే మాత్రం విజయ్ దేవరకొండ సినిమాలకు సౌత్ ఇండియా అంతా క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. గతంలో విజయ్ నటించిన నోటా సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైనప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. డియర్ కామ్రేడ్ సినిమా నాలుగు భాషల్లో విడుదలవుతూ ఉండటంతో విజయ్ దేవరకొండపై ఈ సినిమా హిట్ అవ్వాలన్న ప్రెజర్ బాగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: