అబ్బాయిలు కన్ను కొడితే చెప్పుచుకు కొడతారు.  అదే అమ్మాయిలు ఒక్కసారి కన్నుకొడితే.. అబ్బాయిలు అలా పడి ఉంటారు.  అదే మన హీరోయిన్లు కన్ను కొడితే.. ఇంకేముంది ఇంటర్నెట్లో వైరల్ అవుతారు.  మలయాళం బ్యూటీ ప్రియా వారియర్ కన్ను కొట్టి ఏకంగా గూగుల్ ను బుట్టలో వేసుకుంది.  


కోట్లాది మంది ఆమె ఫోటో కోసం సెర్చ్ చేశారంటే అర్ధం చేసుకోవచ్చు.  సినిమా ప్లాప్ అయ్యిందిగాని లేదంటే మాములుగా ఉండేది కాదు.  ఈ హీరోయిన్ బాటలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడానడుస్తోంది.  సౌత్, నార్త్ సినిమాల్లో బిజీగా ఉంటున్న హీరోయిన్ ఆమె.  


అరవింద సమేత సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న పూజా హెగ్డే, మహర్షితో ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది.  ఇప్పుడు ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నది.  మరోవేపు అల్లు అర్జున్ 19 వ సినిమాలోను నటిస్తూ బిజీ అయ్యింది.  తాజాగా ఈ భామ ఓ ఫోటో షూట్ చేసింది.  


ఎందుకో ఏమో తెలియదుగాని కన్నుకొట్టే కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  అసలే అబ్బాయిలు కన్ను కొట్టే అమ్మాయిలంటే పడిచచ్చిపోతుంటారు.  టాప్ హీరోయిన్ కన్ను కొట్టింది అంటే ఆ ఫోటోను తమ డీపీలుగా పెట్టుకునే పోరగాళ్ళు కోకొల్లలు.  పూజా కన్నుకొట్టే ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: