తెలుగు లో వస్తున్న బిగ్ బాస్3 నిన్నటి ఎనిమిదవ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ రౌండ్ మొదలైంది.  అందరూ తమ అభిప్రాయాలు చెప్పారు..అయితే అందరి అభిప్రాయం ప్రకారం హిమజ, శ్రీముఖి కావడం విశేషం.  అయితే ఎక్కువ మంది కంటెస్టెంట్ రూమ్ లోకి వచ్చి హిమజనే టార్గెట్ చేస్తూ వచ్చారు.  గత ఎపిసోడ్ లో కూడా హిమజ నామినేషన్ రౌండ్ లోఉంది. కాకపోతే హిమజ మాత్రం తన ఎలిమినేష్ విషయంలో ఏమాత్రం బయపడటం లేదని తెలుస్తుంది. గతంలో కౌశల్ ఆర్మీ పేరుతో బయట నానా హంగామా జరిగింది.

హౌస్ లోపల కేవలం కౌశల్, గీతా మాధురి మధ్యనే పోటీ జరిగింది. కానీ సీజన్ 3లో పరిస్థితి అలా కనిపించడం లేదు. ఒకరినిమించేలా మరొకరు హౌస్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఎలిమినేషన్ అయిన హేమ మాటల ప్రకారం ఇంట్లో అందరూ మంచివారే..అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పింది.  విచిత్రం ఏంటంటే నిన్న బాబా మాస్టర్ మాత్రం ఎలిమినేషన్ ఎవరిని చేయాలన్నవిషయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. మూడోసారికి తన మనసులో మాట చెప్పి ఎలిమినేషన్ రౌండ్ పూర్తి చేశారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో హిమజ, పునర్నవి, శ్రీముఖి ల మద్య గట్టి పోటీ వస్తుంది. ఇక సింగర్ రాహుల్, మహేష్ విట్టా ఢీ అంటే ఢీ అనే వ్యక్తిత్వంతో కనిపిస్తున్నారు.  బిగ్ బాస్ 3 లో మొదటి సారిగా పెళ్లైన జంట వరుణ్ సందేశ్ - వితిక వచ్చారు..అయితే హౌజ్ లో వీరిలోకం వీరిదే అన్నట్లు కొనసాగుతున్నారు, దాంతో ఈ జంటపై కూడా విమర్శులు వస్తున్నాయి. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హిమజ గురించి ప్రత్యేకంగా అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

ఆమె మాట్లాడే భాష, సున్నితమైన భావజాలం ఉండడంతో హిమజ అందరికి నచ్చేస్తుంది. హిమజకు టాలీవుడ్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ ఉంది. హైపర్ ఆది, స్నేహ, శ్రద్దా దాస్ లాంటి సెలెబ్రిటీలు బహిరంగంగా హిమజకు మద్దతు చెబుతున్నారు. అభిమానుల్లో ఉన్న క్రేజ్, సెలెబ్రిటీల అండతో తొలివారం హిమజకు అత్యధిక ఓట్లు నమోదైనట్లు సమాచారం. అందుకే హిమజ సులభంగా ఎలిమినేషన్ నుంచి బయట పడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: