ప్రస్తుతం టాలీవుడ్ లో దిల్ రాజు అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నాడు.  నేటి అగ్ర నిర్మాతగా  ఈ తరం సినీ నిర్మాణ విభాగానికే   సరైన గౌరవం  విలువైన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి దిల్ రాజు,   తన నిర్మాణ సంస్థే  ఒక చిన్న సినీ పరిశ్రమ అన్న స్థాయిలో తరువాత తరం కూడా  గుర్తుపెట్టుకోగలిగేంతగా పేరు ప్రఖ్యాతలు సంపాధించుకున్నాడు  దిల్ రాజు.  'తెలుగు సినిమా బాక్సాఫీస్' ప్లాప్ ల్లో  మునిగి కొట్టు మిట్టాడుతున్నపుడల్లా..  ఓ భారీ విజయంతో  తెలుగు సినిమాకే ఊరటనిస్తున్నాడు ఈ బడా నిర్మాత.  అయితే  అగ్ర హీరోలతో  దిల్ రాజు ఈ మధ్య  చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడట. ముఖ్యంగా సినిమా బిజినెస్ విషయంలో ఆ హీరోలతో దిల్ రాజుకి తలనొప్పిగా మారింది.  ఒక సూపర్ స్టార్ హీరోతో గత సినిమా బిజినెస్ విషయంలో దిల్ రాజు విభేదించాయి.  సదరు హీరో రెమ్యూనరేషన్ తీసుకోకుండా నాన్-థియోటర్స్ రైట్స్ తీసుకున్నాడు. 


దీని పై అప్పట్లో దిల్ రాజు అసహనం వ్యక్తం చేశాడు. నిర్మాతకి ఒక రూపాయి వచ్చేది అక్కడే దానినే హీరో తీసుకుంటే ఎలా అంటూ మాట్లాడాడు, ఇప్పుడు అదే హీరోతో మరో సినిమా కూడా చేస్తున్నాడు, ఈ సినిమాకి ఆ హీరో అదే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుంది. ఇక మరో స్టైలిష్ హీరోతో దిల్ రాజు ఒక సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి హీరో తనకి రెమ్యూనరేషన్ వద్దు అని, నాన్-థియోటర్స్ రైట్స్ ఇవ్వమని అడిగినట్లు బొగుట్టు. దీనితో దిల్ రాజు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. లాభాలు వచ్చేవాటిని హీరోలు తీసుకుంటే మేము ఇక సినిమాలు చేసి ఏమి లాభం. థియోటర్స్ రైట్స్ లో సవాలక్ష తలనొప్పులు ఉంటాయి, డిస్టిబ్యూటర్ల దగ్గర నుండి డబ్బులు లెక్కలు తేల్చుకోవటం కష్టంతో కూడుకున్న పని, సినిమా ఏమైనా తేడా కొడితే వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే వచ్చే సినిమాని తక్కువ రేట్లకి అమ్మాలి. 


ఇవేమి లేకుండా నిర్మాత కష్టపడకుండా నాన్- థియోటర్స్ రైట్స్ మీద ఆదాయం వస్తుంది. దానిని అగ్ర హీరోలు తీసుకొనిపోతే ఇక నిర్మాత ఎలా సినిమా తీయగలడంటూ దిల్ రాజు అసహనంతో ఉన్నాడట. ఇలాంటి పరిస్థితుల్లో మరో స్టార్ హీరోతో కూడా ఇదే సమస్య వచ్చేలా ఉందని.. దిల్ రాజు ఆ హీరోతో సినిమానే క్యాన్సల్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.       


మరింత సమాచారం తెలుసుకోండి: