బిగ్ బాస్ సీజన్ 3 ఎవరు ఊహించని విధంగా మలుపులు తిరుగుతుంది. హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా అనుకున్న హేమ మొదటి వారానికే హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఆ స్థానంలో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి హౌజ్ లో గొడవలు మొదలు పెట్టింది. వచ్చి రాగానే వరుణ్ సందేశ్, మహేష్ గొడవపై గొంతు పెంచిన తమన్నా సింహాద్రి గురువారం జరిగిన లస్కరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా వరస్ట్ పర్ఫామర్ గా వరుణ్ తో జైలు శిక్ష అనుభవించారు.      


ఆ టైంలో వరుణ్ సందేశ్ గురించి తెలుసుకున్న తమన్నా తన ఒపినియన్ మార్చుకున్నారు. ఇక గురువారం ఎపిసోడ్ చివర్లో బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ కు టాస్క్ జరిగింది. హౌజ్ బయట ఓ వజ్రాన్ని ఉంచి ఎవరు దాన్ని పట్టుకుంటారో.. వారికి ఇచ్చిన టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు కెప్టెన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.  


ఈ క్రమంలో వరుణ్, హిమజ, అలి రెజాలు కెప్టెన్ కంటెస్టంట్స్ గా పోటీ చేశారు. అయితే వరుణ్ సందేశ్ కు ఇంటి సభ్యుల ఎక్కువ ఓట్లు వేయడం వల్ల అతనే ఇంటి కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో అలి రెజా వజ్రాన్ని దక్కించుకుని రాజుగా ఇంటి సభ్యులపై ఆర్డర్స్ వేశాడు. అందులో భాగంగా హౌజ్ లో ఉన్న లేడీస్, జెంట్స్ గా.. జెంట్స్ కాస్త లేడీస్ గా వేషధారణ వేసుకోవాలి. అలి రెజా ఇచ్చిన టాస్క్ నచ్చని తమన్నా అతని మీద దూషణలకు దిగారు.


ఆ టాస్క్ జరుగుతున్నంతసేపు అలి మీద కోపంతో రగిలిపోయింది తమన్నా సింహాద్రి. ఇదిలాఉంటే బిగ్ బాస్ హౌజ్ ఫస్ట్ కెప్టెన్ గా వరుణ్ సందేశ్ ఎంపికయ్యాడు. మరి ఈ మూడు రోజుల్లో వరుణ్ కెప్టెన్సీ సత్తా ఏంటో ప్రూవ్ అవుతుంది. ఈ వారంలో వరుణ్ కూడా నామినేషన్ లో ఉన్నాడు. మరి కెప్టెన్ గా వరుణ్ హౌజ్ లో ఉంటాడా లేడా అన్నది ఆదివారం రోజు తెలుస్తుంది.        



మరింత సమాచారం తెలుసుకోండి: