భారీ బడ్జెట్ సినిమాల హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం రాక్షసుడు ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. తమిళనాట సంచలన సృష్టించిన రాచ్చసన్ సినిమాని బెల్లకొండ తెలుగులో రీమేక్ చేశాడు. తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ అయినా రాచ్చసన్ సినిమాని రాక్షసుడుగా దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా బెల్లంకొండ పోలీస్ అధికారిగా నటించిన ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.


వ‌రుస ప్లాపుల‌తో ఉన్న బెల్లంకొండ ఈ సినిమాపై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. గ‌తంలో భారీ బ‌డ్జెట్ పెట్ట‌కుండా లో బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించి.... రిలీజ్‌కు ముందే ఈ సినిమాతో ట్రేబుల్ ప్రాఫిట్ లాగేశాడు. ఈ సినిమా టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో పాటు ట్రేడ్‌వ‌ర్గాలు సైతం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నాయి. సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకున్న రాక్ష‌సుడు 149 నిమిషాల నిడివితో ఉంటుందట. దాదాపు రెండున్నర గంటలు సాగే చిత్రమిది.


ఇక ఈ సినిమా బిజినెస్ లెక్కలు తెలిశాయి. శ్రీనుకి గత ఐదారు సినిమాలు హిట్టవ్వకపోయినా `రాక్షసుడు` బిజినెస్ పై ఆ ప్రభావం లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. రాక్షసుడు నైజాం- ఏపి కలుపుకుని 13.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. తెలుగు శాటిలైట్-6 కోట్లు.. హిందీ డబ్బింగ్ - శాటిలైట్ కలిపి -12.5 కోట్లు తెచ్చింది. ఓవరాల్ గా రూ. 35 కోట్ల బిజినెస్ తో షాకిచ్చిందనే చెప్పాలి. 


వ‌రుస ప్లాపుల్లో ఉన్న ఈ హీరోకు ఈ రేంజ్ మార్కెట్ అంటే మామూలు విష‌యం కాదు. ఇక రాక్ష‌సుడు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్‌ను బ‌ట్టి రూ. 13 కోట్లు తెస్తే యావరేజ్. రూ. 15 కోట్లు వసూలు చేస్తే అబౌ యావరేజ్. రూ. 12 కోట్ల లోపు వసూలు చేస్తే ఫ్లాప్ కింద పరిగణిస్తారు. రూ.11 కోట్ల లోపు వసూలైతే డిజాస్టర్ కింద లెక్క తేల్చారు ట్రేడ్ పండితులు.



మరింత సమాచారం తెలుసుకోండి: