విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లోనే డియ‌ర్ కామ్రేడ్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. గ‌త శుక్ర‌వారం ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తొలి ఆట‌కే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విజ‌య్‌కు యూత్‌లో క్రేజ్ ఉన్న తొలి షో, తొలి రోజు వ‌ర‌కే వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఆ త‌ర్వాత కంటెంట్ లేక‌పోతే అత‌డి సినిమాల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇందుకు డియ‌ర్ కామ్రేడ్ పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమాపై ఉన్న హైప్ నేప‌థ్యంలో తొలి రోజు ఏకంగా రూ. 10.5 కోట్ల షేర్ వ‌చ్చింది. 


ఆ తర్వాత కంటెంట్ లేక‌పోవ‌డంతో ఆరు రోజుల‌కు క‌లిపి కేవ‌లం రూ.10 కోట్లు మాత్ర‌మే వ‌చ్చింది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రానికి ఆరవ రోజున కృష్ణా జిల్లాలో నలభై వేల డెఫిసిట్‌ వచ్చింది. దీనిని బ‌ట్టి ఈ సినిమా షేర్ ఎంత దారుణంగా ప‌డిపోయిందో తెలుస్తోంది. అంటే థియేటర్ల రెంట్లకి సరిపడా డబ్బులు కూడా రాకపోగా, వచ్చిన వసూళ్లలో నలభై వేలు ఎదురు కట్టాల్సి వచ్చింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.34 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా.. జ‌రిగిన బిజినెస్‌... వ‌చ్చిన వ‌సూళ్ల‌ను బ‌ట్టి చూస్తే విజ‌య్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది.


డియ‌ర్ కామ్రేడ్ బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే మ‌రో రూ. 15 కోట్ల షేర్ రాబ‌ట్టాల్సి ఉంది. ఇది జ‌ర‌గ‌డం అసాధ్యం. దీనిని బ‌ట్టి డియ‌ర్ కామ్రేడ్ బ‌య్య‌ర్ల‌ను, నిర్మాత‌ల‌ను నిలువునా ముంచేసింది. ఈ సినిమాతో భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యాడు.


వ‌ర‌ల్డ్‌వైడ్‌ డియర్ కామ్రేడ్ మొదటి వారం కలెక్షన్స్: ( రూ.కోట్ల‌లో)
నైజామ్ - 6.54 
సీడెడ్ - 1.16 
ఉత్తరాంధ్ర - 1.58
కృష్ణ - 0.74 
గుంటూరు - 1.04 
ఈస్ట్ - 1.19 
వెస్ట్ - 0.89 
నెల్లూరు - 0.52 
---------------------------------
ఎపీ + తెలంగాణా = 13.66 
---------------------------------
రెస్ట్ ఆఫ్ ఇండియా - 3.53 
ఓవర్సీస్ - 3.30 
----------------------------------
వరల్డ్ వైడ్ టోటల్ = 20.49 
----------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: