అల్లు అరవింద్ నిర్మాణంలో 500 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం సినిమా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరక్టర్స్ నితిన్ తివారి, రవి ఉద్యవార్ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. సినిమా తెలుగు, హింది భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న సినిమా కాబట్టి ఇందులో రాముడిగా రాం చరణ్ నటిస్తాడని అనుకున్నారు.


అయితే చరణ్ తాను ఆ సినిమా చేసే ఛాన్స్ లేదని చెప్పగా రాముడిగా అల్లు అర్జున్ చేస్తాడా ఏంటని అనుకున్నారు. కాని రాముడిగా బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్ ను ఎంపిక చేశారని తెలుస్తుంది. హిందిలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి హృతిక్ అయితే బిజినెస్ బాగుంటుందని మేకర్స్ ఆలోచన.


సినిమాలో రాముడు ఓకే కాని రావణుడిగా నటించగల సత్తా ఎవరికి ఉందని అంటున్నారు. కచ్చుతంగా ఆ పాత్రకి ఎన్.టి.ఆర్ నే తీసుకుంటారని టాక్. ఈ జెనరేషన్ హీరోల్లో తారక్ ఒక్కడే పౌరాణిక పాత్రల్లో మెప్పించగలడు. అందుకే రావణ పాత్రకు తారక్ ది బెస్ట్ అంటున్నారు. కాని అది నెగటివ్ పాత్ర కాబట్టి ఎన్.టి.ఆర్ ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.    


రాముడిగా హృతిక్ రోషన్, రావణుడిగా ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరు ఫైనల్ అయితే ఇక మిగతా పాత్రలను సెలెక్ట్ చేయాల్సి ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసుకుంది. తప్పకుండా సినిమా అంచనాలను అందుకునేలా తీయాలని అల్లు అరవింద్ భారీ స్కెచ్ వేశాడు. మరి రామాయణ్ సినిమా ఎలా ఉంటుంది.. ఎవరెవరు ఏయే పాత్రలు చేస్తారో చూడాలి. కేవలం కాస్టింగ్ మాత్రమే కాదు సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తారని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: