చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తో పైకొచ్చిన నటుడు మహేష్ విట్టా.కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రిష్ణమూర్తి, రమణమ్మ దంపతులకు తొలి సంతానంగా పుట్టాడు మహేష్. అతడికి ఓ చెల్లి ఉంది,ఆమె పేరు భారతి. అతని చిన్ననాటి చదువంతా ప్రొద్దుటూరులో సాగింది.మహేష్ కి కోపం ఎక్కువ అని చాలా మంది అంటుంటారు. కానీ అతడు మాత్రం సమాజం కఠినమైందని అందుకే కాస్త కఠినంగా ఉండాలని, అది అందరికీ కోపంగా కనిపిస్తుందనీ అంటాడు. ఒకరి కోసం నా ప్రవర్తన మార్చుకోను నా పద్ధతి నాదే అంటాడు.




బిగ్ బాస్ టీంకి కావలసింది కూడా ఇదే. దాంతో స్టార్ మా లో బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యాడు.ఈ నేపథ్యంలో నిన్న జరిగిన బిగ్ బాస్ షో ఎపిసోడ్ లో జాఫర్ వెళ్ళిపోయిన సందర్భం లో మహేష్ విట్ట భావోద్వేగానికి గురయ్యాడు.నటుడు కావాలనేది అతని చిరకాల స్వప్నం. అందుకే ఎంసీఏ చదవాలని హైదరాబాద్ వచ్చాడు. ఎల్బీనగర్ పికెఆర్ కాలేజీలో ఎంసీఏ పూర్తి చేశాడు. ఆరోజుల్లోనే తన లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ చిత్ర పరిశ్రమలో పరిచయాలు పెంచుకున్నాడు. 'నేను పలానా' అనే ఒక షార్ట్ ఫిలిం కూడా తీశాడు. దానికి అతడే దర్శకత్వం వహించాడు.




అయితే ఆ షార్ట్ ఫిలిమ్ కోరుకున్న ఫలితాన్ని రాబట్టకపోయినా మిత్రులందరికీ బాగా నచ్చింది. ఆ ప్రోత్సాహంతో అతడు ముందడుగు వేశాడు. ఒక ఛానల్ డైరెక్టర్ తో స్టోరీ రాయటంలో పాలు పంచుకునే అవకాశం రావడంతో మహేష్ భాషను, యాసను, అతని బాడీ లాంగ్వేజి చూసిన దర్శకుడు ఫన్ బకెట్ లు ఆర్టిస్ట్ గా అవకాశమిచ్చాడు. అక్కడి నుంచి మహేష్ దశ తిరిగింది. మంచి నటనతో తనదైన శైలిలో దూసుకు పోయాడు మహేష్ విట్టా. రాయలసీమ యాసతో ఇరగదీశాడు. సీమంటే ఫ్యాక్షనే కాదు యాక్షన్ కూడా అని రుజువు చేశాడు. ఫన్ బకెట్ లో చేస్తుండగానే మరో షార్ట్ ఫిలింలో చేసే చాన్స్ కూడా వచ్చింది. మహేశ్ షార్ట్ ఫిలిం చూసిన డైరెక్టర్ తేజ ఓ రోజు ఆఫీసుకి రమ్మన్నారు.





ఇండస్ట్రీలో కమెడియన్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఆ వైపు ఆలోచించు భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి దూసుకొచ్చాడు. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తీసిన సినిమాలో హీరో నానికి స్నేహితుడిగా మహేష్ చేశాడు. 150 షార్ట్ ఫిల్మ్ లు చేశాడు. ఫన్ బకెట్ 200 ఎపిసోడ్ లు పూర్తి చేశాడు. 25 సినిమాలలో నటించాడు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చే మహేష్ తండ్రితో కలిసి చెల్లెలు వివాహాన్ని చేశాడు.



మహేష్ బహుముఖ ప్రజ్ఞాశాలి ట్రెడిషనల్ ఫుడ్స్ యూట్యూబ్ చానల్లో కర్రీలు కూడా చేసి చూపించాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ పైకొచ్చాడు మహేష్. మహేష్ విట్టా "నేనే రాజు నేనే మంత్రి" సినిమాతో ఎంట్రీ ఇచ్చి "కృష్ణార్జున యుద్ధం, ఛలో, విజేత, నా నువ్వే, పేపర్ బాయ్" సినిమాలలో చేశాడు."పడి పడి లేచే మనసు" సినిమాలో కూడా నటించాడు. ఇదిలావుండగా అటు సినిమాలు చేస్తూనే మరో పక్క తనలో ఉన్న టాలెంట్ ను చూపించుకునే పనిలోపడ్డాడు. "ఆవకాయ" అనే పేరుతో ఓ ఆల్బం సాంగ్ రాసి అలరించాడు. లిరిక్స్ మ్యూజిక్ తో ఈ పాట కూడా వైరల్ గా మారి ఉర్రూతలూపింది.





మహేష్ విట్టా నటించిన "ఎర్రినా వెంకటేశ, హెచ్ టూఒ, బాబు బీటెక్, బాబు బంగారం, ఖేల్ ఖతం దుకాణ్ బంద్ "తదితర షార్ట్ ఫిల్మ్ లు కామెడీ సిరీస్ లు సూపర్ హిట్ అయ్యాయి. వీటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వీటిలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. కమెడియన్ గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాగా రాణించాలనే లక్ష్యంతో వున్నాడు. మహేష్ కి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదగాలనే కోరిక బలంగా ఉంది. అందులోనూ నెగిటివ్ రోల్స్ చేయాలన్న ఆసక్తి బాగా ఉంది. ఇది అంచెలంచెలుగా ఎదిగిన మహేష్ విట్టా రియల్ స్టోరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: