సూపర్‌స్టార్‌ కృష్ణ తనయుడు మహేష్‌బాబు నటిస్తున్న చిత్రాలకు ముందుగా కథను తాను ప్రేక్షకుడిలా వింటాడనీ ఆయనతో పనిచేసిన‌ దర్శకులు చెబుతున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ముందుగా మహేష్‌బాబు డేట్స్‌ విషయంలో ఆమె భార్య నమ్రత పాత్ర ముఖ్యమనీ.. తనకు ముందు నచ్చాకే మహేష్‌ దృష్టికి తీసుకువస్తుందని చెబుతుంటారు. ఏదిఏమైనా మహేష్‌బాబు సూపర్‌స్టార్‌గా ఎదగడంలో కథల్లో తీసుకున్న జాగ్రత్తలతోపాటు ఆయనకున్న గ్లామర్‌ ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఈనెల9న మహేష్‌బాబు పుట్టినరోజు. ప్రస్తుతం మమేష్‌బాబు 'సరిలేరునీకెవ్వరూ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్‌రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. ఇక మహేష్‌ సెట్లో ఎలావుంటాడనేది అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడు. కానీ మాట్లాడితే తన వారిగా భావించి జోక్‌లువేస్తూ కలుపుగోలుగా వుంటారు. అంతకుముందు శ్రీనువైట్లతో పనిచేసిన సందర్భంలోనూ ప్రస్తుతం అనిల్‌రావిపూడితో పనిచేస్తున్న సందర్భంలోనూ ఆయనలో ఎటువంటి మార్పురాలేదని తెలుస్తోంది. ఈ విషయమై అనిల్‌రావిపూడి మాట్లాడుతూ..  సెట్లో ఉంటే 80 శాతం టైమ్‌ నవ్వుతూనే కనిపిస్తారు. పెద్ద హీరోతో పనిచేస్తున్నాననే భయం ఎక్కడో ఉంటుంది కదా.. అది లేకుండా చూస్తారు. ఆయనలోని బెస్ట్‌ థింగ్స్‌లో అదొకటి. ఏ డైరెక్టరైనా ఒకసారి ఆయనతో పనిచేస్తే, ఇంకో పది సినిమాలు చెయ్యాలనిపించేలా ఉంటుంది. ఆయనతో పనిచేస్తే కంఫర్ట్‌ లెవల్స్‌ ఆ రేంజ్‌లో ఉంటాయి. 


మొదటగా కథ చెప్పడానికి 2018 ఆగస్ట్‌లో మహేశ్‌గారిని కలిశాను. ఆయన దగ్గరకు నెర్వస్‌గానే వెళ్లాను. ముందుగా టీ తాగి, రెండు నిమిషాలు మాట్లాడాక ఆ నెర్వస్‌నెస్‌ పోయింది. ఆ కన్‌ఫర్ట్‌ లెవల్స్‌ ఆయన ఇచ్చారు. దాంతో ఒక గంటసేపు కథ చెప్పాను. కథ వినడంలో ఆయన బెస్ట్‌ ఆడియన్‌. థియేటర్‌లో సినిమాని ఒక ప్రేక్షకుడు ఎలా చూస్తాడో, కథ వినేటప్పుడు ఆయన అలాగే అనిపిస్తారు. కథలోని ఎమోషన్స్‌కు, సీన్స్‌కు అలా రెస్పాండ్‌ అవుతారు. ఒకసారి సెట్స్‌పైకి వెళ్లాక తన పాత్రలో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయిపోతారు. ఆయన క్యారెక్టర్‌ను పోషించడంలో కచ్చితంగా ఇంప్రొవైజేషన్‌ ఉంటుంది, ఎనర్జీ లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయి. 


చాలా రోజుల నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆయన నుంచి దేనికోసం ఎదురు చూస్తున్నారో అలా 'సరిలేరు నీకెవ్వరు'లో కనిపిస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎనర్జీ లెవల్స్‌, యాక్షన్‌.. అన్నీ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పక్కా మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌. మహేశ్‌ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వాటిని అందుకొనేలా ఈ సినిమా ఉంటుంది. మంచి కంటెంట్‌ ఉంది. మంచి ఆర్టిస్టులు ఉన్నారు. కథకు లింకయ్యే మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. ఫన్‌ ఉంటుంది. మొత్తంగా మూవీ ఒక విజువల్‌ ఫీస్ట్‌గా ఉంటుంది.


నేను ఫస్ట్‌ సినిమా చేసినప్పట్నుంచీ కూడా మహేశ్‌గారితో పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. ఇప్పటికి ఆ గ్రేట్ ఛాన్స్‌ వచ్చింది. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాననేదే నేను చెయ్యాల్సిన పని. ఆయన ఆ ఛాన్స్‌ ఇచ్చినప్పుడు, అంతే లెవల్‌కు రిజల్ట్‌ చూపించగలిగితే అదొక మెమరబుల్‌ మూవీగా మిగిలిపోతుంది. నేనిప్పుడు అదే చేస్తున్నా' అంటూ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: