బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ఐదు ఏళ్ళు అయింది. అయిదేళ్ళ‌లో  ఏడు చిత్రాలు న‌టించినా అనుకున్నంత హిట్ మాత్రం రాలేదు.  అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మించిన చిత్రం రాక్ష‌సుడు. ర‌మేష్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్‌ 2న విడుదలై సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సూపర్‌ హిట్‌ టాక్‌తో సక్సెస్‌పుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్  వి. వి వినాయక్  ఈచిత్రం పై స్పందించారు....


 ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ద‌ర్శ‌క‌త్వంలో నేను ఇంట్రడ్యూస్ చేసిన సాయి శ్రీనివాస్ కి హిట్ రావడం అనేది  చాలా సంతోషంగా ఉంది. సాయి కన్నా నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది. దానికి కారణమైన రమేష్ వర్మ కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు నాకు మంచి సన్నిహితుడు. చాలా మంచి వ్యక్తి. ఆయ‌న చాలా గొప్ప వ్యక్తి.  వాళ్లబ్బాయి  హీరో అయుండి కూడా ఈ కథకు సాయి అయితే పర్ఫెక్ట్ అని సాయి ని ఎంచుకోవడం నిజంగా గొప్ప విషయం. అలాగే సినిమాకు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాకు ఏది అవసరమో అన్ని సమకూర్చి ఒక సూపర్ హిట్ సినిమా చేశారు. అందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ రీమేక్ చేయడం సులభం అనుకుంటారు. కానీ రీమేక్ చాలా కష్టం. రాక్షసుడు తమిళ్ వెర్షన్ నేను చూశాను. ఆ సినిమాలో లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఎక్కడా టెంపో మిస్ అవకుండా రమేష్ వర్మ చాలా జాగ్రతగా తెరకెక్కించారు. ఒక సందర్భంలో రమేష్ వర్మ ని డైరెక్షన్ వైపు ఎందుకు వచ్చావు అని అడిగాను.. దానికి అతను దాదాపు 800 సినిమాలకు డిజైనర్ గా పనిచేసి బోర్ కొట్టి వచ్చాను సర్.. అని చెప్పాడు. ఆ సమాధానం నాకు బాగా నచ్చింది. కొంతకాలానికి ఏ పనియైన బోర్ కొడుతుంది. కానీ అతనికి దర్శకత్వం బోర్ కొట్టదు. ఈ బ్యానర్లో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. రమేష్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి. అలాగే సాయి తో ఇలాంటి మంచి సినిమాలు తీయాలి. వీరిద్దరిది మంచి హిట్ కాంబినేషన్. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్ తెలియాజేస్తున్నాను. సాయి కి ఇంకా మంచి సూపర్ హిట్ లు రావాలని మనస్పార్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.


 సాయి ఫస్ట్ నుండి చాలా మెచ్యూర్ గా ఉండేవాడు. అలాగే ప్రతి సినిమాకు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. అప్పటికి ఇప్పటికి నేను అయితే పెద్దగా తేడాలు ఏమి గమనించలేదు. కథకు ఎలా కావాలో అలా చేస్తున్నాడు. అల్లుడు శీను వచ్చి అయిదు సంవత్సరాలు అయింది. నాకైతే  ఆ సినిమా వచ్చి అయిదు సంవత్సరాలు అయింది అంటే నమ్మబుద్ది కావడం లేదు. నిన్న కాక మొన్ననే రిలీజ్ చేసిన ఫీలింగ్ ఉంది. సాయితో  ఒక పెద్ద సినిమా తీయాలి. దానికి మంచి కథ సెట్ అవ్వాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: