బాహుబలి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అదే విధంగా ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు దుమ్ము రేపాయ్. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను ప్రకటించారు. మహానటి కి మూడు మహా పురస్కారాలు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా మహానటి నిలిచింది. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్  టైటిల్ రోల్ పోషించారు. ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంది. ఇక 'చి ల సౌ' చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు దక్కింది.


నాని ప్రొడ్యూస్ చేసిన 'ఆ' చిత్రానికి కూడా అవార్డులు దక్కాయి. ఉత్తమ మేకప్ స్టైలింగ్ పురస్కారాలు 'ఆ' సినిమాకు దక్కాయి. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో నటించారు. రంగస్థలం సినిమాకు ఉత్తమ ఆడియోగ్రఫీ అవార్డు ప్రకటించారు. ఇక ఉత్తమ జాతీయ చిత్రంగా బాలీవుడ్ మూవీ అంధూధున్ నిలిచింది. ఆయుష్మాన్ ఖురానా, టబు నటించిన ఈ సినిమా మంచి రివ్యూలు రాబట్టింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ అంధుడిగా నటించారు.


ఓ క్రైం చుట్టూ తిరిగే ఈ సినిమాకూ అత్యుత్తమ పురస్కారం లభించింది. ఆయుష్మాన్ కు ఉత్తమ నటుడిగా పురస్కారం లభించింది.ఇక సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తెరకెక్కిన 'యూరీ' చిత్రంలో నటించిన విక్కీ కౌశల్ కూడా ఉత్తమ నటుడిగా నిలిచాడు. అదే సినిమాను తెరకెక్కించిన ఆదిత్యధరకు ఉత్తమ డైరెక్టర్ అవార్డు దక్కింది. మరోవైపు కన్నడ చిత్రం కేజీఎఫ్ కు అవార్డులు దక్కాయి. ఉత్తమ గ్రాఫిక్స్, ఉత్తమ యాక్షన్ చిత్రంగా నిలిచింది 'కేజీఎఫ్'. జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలకు కూడా స్థానం లభించింది. ఎన్నో అవార్డులు 'మహానటి' చిత్రం అలాగే 'ఆ' చిత్రం 'రంగస్థలం' చిత్రాలు గెలుచుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: