డైరక్టర్ పరుశురామ్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయో సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా గీత గోవిందం అని చెప్పాలి. విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యపరచింది. ఇక ఈ సినిమా వచ్చి సరిగ్గా ఏడాది అయింది. ఓ మాంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి కూడా  ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నాడు డైరక్టర్ పరుశురామ్. అయితే నిర్మాతలు లేకపోలేదు, సబ్జెక్ట్ లు లేకపోలేదు. హీరోనే సెట్ కావడం లేదు. నిర్మాత అల్లు అరవింద్ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే కాంబినేషన్ సెట్ చేయాలనుకున్నారు. కానీ పరుశురామ్ రెడి చేసిన స్క్రిప్ట్ ఆయనకే నచ్చక, పక్కన పెట్టారట. 

దాంతో డైరెక్ట్‌గా ట్రయ్ చేసుకుందామని, కొరటాల శివ సహాయంతో మహేష్ బాబు దగ్గరకు వెళ్లి స్క్రిప్ట్ వినిపించారట.కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం పరుశురామ్ కు మహేష్ బాబు బై బై చెప్పేసారని తెలుస్తోంది. అంతేకాదు మహేష్ బాబు ఈ విషయంలో చాలా గౌరవంగా, మర్యాదగా ఓ మెసేజ్ పంపించారని టాలీవుడ్ లో 4-5 రోజులుగా వినిపిస్తోంది. 'పరుశురామ్ చెప్పిన స్క్రిప్ట్ చాలా బాగుందని...అలాంటి స్క్రిప్ట్, నా కోసం తయారు చేసిన పాత్ర నిజంగా గొప్పదని.. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఆ స్క్రిప్ట్ ఓకె చేయలేనంటు..పరుశురామ్ వేరే ప్రాజెక్టు చూసుకోవచ్చు' అన్నట్టుగా చెప్పారట. 

కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉందని తెలుస్తుంది. పరుశురామ్ వినిపించిన స్క్రిప్ట్ లో  బ్యాంకు రుణాల ఎగవేత, స్కామ్ లాంటి వ్యవహారాలు వున్నందువల్ల ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ ఫ్రస్తుతం చేయడం ఇష్టం లేక మహేష్ బాబు నో చెప్పారని వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకుంటున్నారు కనుక, ఆ తరువాత రాజమౌళి ప్రాజెక్టు కూడా రెడీగా ఉండటంతో పరుశురామ్ ను వెయిటింగ్ లో పెట్టడం ఇష్టం లేక నో చెప్పారని మరో మాట కూడా వినిపిస్తుంది. ఈ సంగతి ఇలా ఉంటే 
నిజంగా అంత మంచి సబ్జెక్ట్ అయితే అల్లు అరవింద్ కు ఎందుకు నచ్చలేదు అన్నది ఇప్పుడు కొత్తగా చాలామంది మనసులో మొదలైన ప్రశ్న. మరి అసలు కారణాలు ఏంటనేది..అల్లు అరవింద్ గానీ, మహేష్ గానీ..లేదా పరుశురామ్ గానీ చెప్తే తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: