ఈ డైలాగ్స్ అంటుంది ఎవరో కాదు మెగా మీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి నటిస్తున్న మూవీ  ‘అలా వైకుంఠపురంలో’.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి రెండూ సూపర్ హిట్ అయ్యాయి.  ప్రస్తుతం ఇదే సెంటిమెంట్ తో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో  ‘అలా వైకుంఠపురంలో’ మూవీ తెరకెక్కుతుంది.  ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ ఎన్నో రకాలుగా అనుకున్నా సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్ ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.     

అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ తో ఉంటుందట.  ఇక టీజర్ చూస్తుంటూ బన్ని చాలా సింపుల్ కుర్రాడిలా..మన మద్య తిరుగుతున్న సామ్యన మద్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయిలా కనిపిస్తున్నాడు.  మురళీ శర్మ కూడా మద్యతరగతి తండ్రిలా కనిపిస్తున్నాడు.  త్రివిక్రమ్ ఏ సినిమా తీసినా అన్ని వర్గాల అభిమానుల గుండెలకు హత్తుకునేలా తీస్తారు.

ఆయన సినిమాలో డైలాగ్స్ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఇవాళ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తనకు కలిసొచ్చిన ‘అ’ సెంటిమెంట్‌తోనే ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ను పెట్టాడు.  టీజర్ విషయానికి వస్తే.. ‘‘ఏంట్రా గ్యాప్ ఇచ్చావు’’ అని మురళీ శర్మ బన్నీని అడగగా.. ‘‘ఇవ్వలా.. వచ్చింది’’ అంటూ తన మీద తానే సెటైర్ వేసుకున్నాడు.

దీన్ని బట్టి బన్నీ ఇంతకాలం గ్యాప్ ఎందుకు ఇచ్చాడో చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఈ మూవీలో నివేథా పేతురాజ్, జయరామ్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, రావు రమేష్, సునీల్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే సంక్రాంతి బరిలో దించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: