మన తెలుగు ఇండస్ర్టీలో హాస్యం అనగానే గుర్తుకు వచ్చే నటీనటులలో నటి హేమ ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే నటి హేమ.హేమ అసలు పేరు క్రిష్ణవేణి ఈమె తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామంలో కోళ్ల కృష్ణ, లక్ష్మి దంపతులకు జన్మించారు. హైస్కూల్ వరకూ తన సొంత ఊరులోనే చదివి డిగ్రీ ప్రైవేట్ గా చదివింది.తరువాత ఆమె మద్రాసులో నృత్యం నేర్చుకున్నారు. "ఈర మైన రోజా" అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది హేమ. 1989 లో "భలే దొంగ"  సినిమాతో తెలుగు సినిమాలలో అడుగుపెట్టి హాస్యనటిగా క్యారెక్టర్ నటిగా పేరు తెచ్చుకుని సుమారు రెండు వందలకు పైగా సినిమాలలో నటించింది.


ప్రముఖ నటి హేమకు టాలీవుడ్ లో వదిన, గయ్యాళి భార్య, తల్లి పాత్రలో ఆమె పలు చిత్రాల్లో నటించారు. ఇటీవలే ఈమె "వినయ విధేయ రామ"  చిత్రంలో కైరా అద్వానీకి తల్లి పాత్రలో నటించింది. బ్రహ్మానందం,హేమ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్లు నవ్వుల వర్షం కురిపిస్తాయి. 250కి పైగా చిత్రాల్లో ఆమె తన ప్రతిభను చాటి, విభిన్న పాత్రలలో రాణించారు. ఈమె భర్త  ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పేరు 'సయ్యద్ జానా' ఈమెకు ఒక కూతురు పేరు 'ఈషా'. ఆమె జీవితంలో వ్యక్తిత్వానికి కొన్ని ఘట్టాలు వివరించింది ఉదాహరణకి ఒక సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమ ఇలా ఉంటుందని అలా ఉంటుందనీ ఆరంభంలో కొంత మంది నన్ను భయపెట్టారు. దాంతో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకునే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను.


నాకు కొత్త కావడం వలన నా జోలికి ఎవరూ రాకుండా నా సీనియర్స్ అండగా నిలిచారు. చిత్ర పరిశ్రమలో సీనియర్ ఆర్టిస్టులలో కొంత మంది తాగేసి ఆరోగ్యం, జీవితం పాడు చేసుకున్న వాళ్లు ఉన్నారని, వాళ్ళను చూసి జీవితంలో ఎక్కడా ఎప్పుడూ డ్రింక్ చేయకూడదని నిర్ణయించుకున్నానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికి నేను దూరంగానే ఉన్నానని, ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అని నటి హేమ చెప్పారు. ఇక ఇప్పటికీ తను గ్లామరస్ గా కనిపించడానికి కారణం సమయానికి ఆహారం ,నిద్ర ఉండేలా చూసుకోవడమే అని చెప్పారు. ఇండస్ట్రీలో ఎంతో మంది మహిళా ఆర్టిస్టులు కష్టాలు పడుతున్నారని, అలాంటి వాళ్లను ఆదుకోవాల్సిన అవసరం మన దర్శకనిర్మాతలపై ఉందని, ముందు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు తిండిపెట్టాలి అంతె కాని ఎక్కడో బయటినుంచి లేడీ ఆర్టిస్టులను తీసుకొచ్చి తెలుగు ఆర్టిస్టులకు అన్యాయం చేయొద్దని ఆమె కోరుతూ, ఈరోజు ఇండస్ర్టీలో ఆడవాళ్ళు వేషాలులేక ఆర్థికంగా చాలా కష్టాలు పడుతున్నారని, వాళ్ల ఆకలి బాధను గుర్తించి వేషాలు ఇవ్వాలని కోరారు.


ఇక మా అసోసియేషన్ లో 800ల మంది సభ్యులుంటే వాళ్లలో ఓ 150 మంది మహిళలు ఉంటారని కనీసం వాళ్లకు అన్నం పెట్టి,బట్టలు కూడా ఇవ్వలేమా దయచేసి మన తెలుగు మహిళా ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వండి అని హేమ తపనపడుతూ అంకితభావాని చాటారు. ఒకసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పాలక వర్గ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ లో మా ఉపాధ్యాక్షురాలిగా హేమ గెలిచారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆమె విజయం సాధించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విజయం సాధించటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నలుగురు మగవాళ్లను ఓడించి, తాను ఈ ఎన్నికల్లో గెలుపొందానని చెప్తూ ఈ విజయాన్ని సినీ పరిశ్రమలోని మహిళలకు అంకితం చేస్తున్నానని, వారి మద్దతు లేకుండా తాను ఈ విజయాన్ని సాధించలేదని,


ఏవైతే హామీలను ఇచ్చానో వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తానని నటి హేమ చెప్పటమే కాకుండా ఆమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా చాటారని, పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి, సినిమాల్లో తనని ప్రేక్షకులు ఎలా అయితే ఆదరించారో బయట కూడా అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నానని ఆమె తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, రాజమండ్రిలో ఇల్లు కట్టుకుంటారని, హైదరాబాద్ లోని సినీ పరిశ్రమను వీడి బాహ్య ప్రపంచంలోకి వస్తానని తెలుపుతూ ఏపీ ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. కాపుల కోసం బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు నటి హేమ. హేమ గతంలో మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన హేమ ఓటిమిపాలయ్యారు.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు కాని, పార్టీలో చేరిన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాలేదని, సినీ పరిశ్రమకు దూరంగా పూర్తిగా రాజకీయాలకి అంకితం కావాలనుకుంటున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు నటి హేమ. హేమకు కాస్త ఆవేశం ఎక్కువే ఒకసారి ఏదో మీటింగ్ లో జనం కిటకిటలాడుతూ,తోసుకుంటూ వెళుతున్నారని అక్కడ చాలా ఇరుకుగా ఉందని ఆ టైంలోనే ఎవడో తన నడుము పట్టుకొని గిల్లాడని వెంటనే వాడిని పట్టుకొని తుక్కుతుక్కు కింద బాదేశి, దబదబమని సౌండ్ వచ్చేటట్టు చితక్కొడితే దెబ్బకి తాను వెళ్లడానికి దారిచ్చారని ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు హేమ. తాజాగా బిగ్ బాస్ షోలో ఆమె సంచలనం అందరికీ తెలిసిందే బిగ్ బాస్ షోకు వెళ్లిన తర్వాత అందరూ నన్ను కాంట్రవర్షియల్ అని అంటున్నారు.


దయచేసి నాకు ఆ టైటిల్ తగిలించవద్దు రెబల్ నవ్వుల హేమ అనే రెండు టైటిల్స్ నాకు చాలు. వాస్తవానికి ముప్పై ఏళ్లుగా నేను పరిశ్రమలో నటిగా ఉన్నాను. నాకన్న ఆ హౌస్ లో వాళ్లు చాలా ఎక్కువగా నటించేస్తున్నారు. నేను నాలాగే ఉంటాను. అలా నటించడం నాకు రాదు. నేను బిగ్ బాస్ షోలో అడుగు పెట్టే సమయంలో నువ్వు నీలా ఉండు, నటించొద్దు, అని చాలా మంది చెప్పారు. అందుకే నేను నా పద్ధతిలో గేమ్ లో పాల్గొన్నాను. అయినప్పటికీ గేమ్ లో గెలవాలని ఎవరికైనా ఉంటుంది. అందుకే వారు అలా నటించక తప్పడం లేదు అన్నారు. సినీ రాజకీయ వినోద సేవా రంగాల్లో హేమాది విభిన్నమైన ముద్ర. ఆవేశం, ఆదర్శం, ఆశయం అన్నింటికీ మించి సంచలనంతో ఆమె నిజ జీవితం అద్భుతంగా అనిపిస్తుంది ఆమె రియల్ స్టోరీ ఎంతో ఉద్వేగంగా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: