మెగాస్టార్ చిరంజీవి.. ముద్దుగా అభిమానులు అన్నయ్యగా పిలుచుకుంటారు.  అన్నయ్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఉండే సంబరాలు అన్నీఇన్నీకాదు.  భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.  టపాసులు కలుస్తూ థియేటర్ల దగ్గర పండుగ చేసుకుంటారు.  ఇక అన్నయ్య పుట్టినరోజు వస్తుంది అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది.  అందులో సందేహం అవసరం లేదు.  
2007 వ సంవత్సరం ముందు వరకు మెగాస్టార్ పుట్టినరోజు అంటే అంటే నాలుగు రోజుల ముంచునుంచే ఆ హడావకుడి మొదలయ్యేది.  ఉదయం నుంచి టీవీల్లో, రేడియోల్లో మెగాస్టార్ పాటలు, సినిమాలు వేసేవారు.  ఎప్పుడైతే అన్నయ్య రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారో అప్పటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అందరివాడు, మనందరివాడు అనుకున్న మెగాస్టార్ కొందరివాడుగా మారిపోవాల్సి వచ్చింది.  రాజాకీయాలంటే అలాగే ఉంటాయి మరి.  


రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మెగాస్టార్ కు అసలు విషయం అర్ధం అయ్యింది.  రాజకీయాలు అందరికి సరిపడవని తెలుసుకున్నారు.  ఏడేళ్ల తరువాత తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.  తన కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా మారి మెగాస్టార్ రి ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 ను ప్రారంభించారు.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  సినిమా హిట్ కొట్టడంతో.. తనలో ఆ పవర్ తగ్గలేదని మరోమారు నిరూపించారు.  


మెగాస్టార్ నటించే సినిమాలు ఇకపై సొంత ప్రొడక్షన్స్ లోనే ఉండాలని చెప్పి, తన తండ్రి ఎప్పటి నుంచో కలకంటున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సైరాగా తీసేందుకు సిద్ధం అయ్యారు.  అనుకున్నట్టుగానే సినిమా రెడీ అయ్యింది.  ఆగస్టు 14న ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో, ఆగష్టు 20 న టీజర్ రిలీజ్ అయ్యాయి.  ఫ్యాన్స్ ఎప్పుడూ
జరుపుకున్నట్టుగానే ఒకరోజు ముందుగానే మెగాస్టార్ బర్త్ డే వేడుకలు శిల్పకళావేదికలో అంగరంగవైభవంగా జరిగాయి.

  ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ హాజరుకావడం విశేషం.  
ఇక ఇదిలా ఉంటె, ఈరోజు మెగాస్టార్ బర్త్ డే.. అభిమానులు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.  రక్తదానం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 


పేదలకు అన్నదానాలు, హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 22, 1955 లో పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తురూలో జన్మించిన చిరంజీవి.. 1978లో పునాదిరాళ్ళు సినిమాతో చిత్రపరిశ్రమలు పరిచయం అయ్యారు.  అయితే, పునాది రాళ్లు సినిమాలో నటించినా.. మొదటగా ప్రాణం ఖరీదు రిలీజ్ అయ్యింది.  మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు. ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన చిరంజీవి మరెన్నో గొప్పగొప్ప సినిమాల్లో నటించాలని కోరుకుందాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: