మెగాస్టార్ చిరంజీవి అంటే ఆబాలగోపాలానికి ఎంతో ఇష్టం. ఏ హీరోకి అయినా ఫ్యాన్స్ కొన్ని సెక్షన్లలోనే ఉంటారు. అదే చిరంజీవి విషయానికి వస్తే అలా కాదు, ఆయన అభిమానులు అపుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి  వ్రుద్ధుల వరకూ ఉంటారు. అంతలా అన్ని వర్గాల ఏకగ్రీవ మద్దతు సంపాదించుకున్న చిరంజీవి జీవితంలో సినీ కెరీర్ లో  ఎక్కని ఎత్తులు లేవు, అందుకోని అవార్డులు కూడా లేవు, కానీ ఒకే ఒక  అవార్డు మాత్రం చిరంజీవిని ఇంకా వరించలేదు. 


అదేంటి అంటే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డ్ కి చిరంజీవి అన్ని విధాలుగా అర్హుడే. ఆయన చేసిన చాలా సినిమాలు చూస్తే ఆయనకు ఏనాడో ఈ అవార్డు రావాల్సివుందనిపిస్తుంది. అంతెందుకు రుద్ర వీణ మూవీకి చిరంజీవికి జాతీయ అవార్డు 30 ఏళ్ళ క్రితమే రావాలి. స్వయంక్రుషి కానీ, ఆపద్భాంధవుడు  కానీ చిరంజీవి పెర్ఫార్మెన్స్ అదుర్స్ అన్నట్లుగా ఉంటుంది. మరి చిరంజీవికి ఎందుకు ఆ అవార్డు ఇప్పటివరకూ  రాలేదు.


ఆ మాటకు వస్తే తమిళంలో కమల్ హాసన్, విక్రం లాంటి నటులకు ఎపుడో జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు వచ్చాయి. తెలుగులో శిఖర సమానుడు అయిన చిరంజీవికి అవార్డు రావాల్సి ఉన్నా వివక్ష కారణంగానే రాలేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక పద్మ అవార్డుల్లో కూడా ఎపుడూ తెలుగు వారికి తీరని అన్యాయమే జరిగింది. చిరంజీవికి పద్మ భూషణ్ అవార్డు అయితే వచ్చింది. మరి జాతీయ అవార్డుల్లో మాత్రం ఇంకా ఆ వివక్ష సాగుతూనే  ఉంది.


ఈ విషయంపై ఆయన సోదరుడు, నటుడు నాగబాబు మాట్లాడుతూ అన్నయ్యకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రాలేదన్న బాధ తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఆ లోటు కూడా తీరితే బాగుంటుంది అన్నారు. మరి సైరా నరసింహా రెడ్డి మూవీ ఎటూ చిరంజీవి చేస్తున్నారు కాబట్టి వచ్చే ఏడాదికైనా ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు  అవార్డు కచ్చితంగా వస్తుందని అంతా భావించాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: