ప్రియాంక చోప్రా 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ గా ఎంపికైన నాటి నుంచీ సెన్సేషనే. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి బేవాచ్ సిరీస్ లో నటించింది. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ ఈవెంట్లు ఎన్నింటికో హాజరై తన డ్రెస్సింగ్ తో ఆకట్టుకుంది. తనకన్నా తొమ్మిదేళ్ల చిన్నవాడైన నిక్ జోనాస్ తో ప్రేమాయణం సాగించి పెళ్లి కూడా చేసుకుని వార్తల్లో నిలిచింది.

 


ఆగస్ట్ 24న తన తండ్రి అశోక్‌ చోప్రా జయంతిని పురస్కరించుకుని సోషల్‌ మీడియాలో వారి అనుబంధాన్ని పంచుకుంది. ఎంతో ఆవేదనతో ఓ పోస్ట్‌ పెట్టి తన బాధను తెలియజెప్పింది. తన తండ్రికి ఇష్టమైన ఓ పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో జత చేసి తన తండ్రి ఫొటోను పోస్ట్‌ చేసింది. ‘మీ ప్రతి పుట్టినరోజును నేను, సిద్ధార్థ్‌ సర్‌ప్రైజ్‌ గా ప్లాన్‌ చేయాలని అనుకునేవాళ్లం. కానీ చేయలేకపోయేవాళ్లం. ఎందుకంటే మీకు మేం చేసే ఏర్పాట్లు ముందే తెలుసుకునేవారు. మీరెక్కడున్నా.. ప్రతిరోజూ మా మధ్య ఉన్నట్లే అనిపిస్తుంది. నేను చేసే ప్రతి పనిలో మీ ప్రోత్సాహం కనిపిస్తుంది. నేను ఎంచుకునే ప్రతి మార్గంలో మీ అంగీకారం, మీ సహకారం కావాలని కోరుకుంటాను. నాకు జరిగే ప్రతి విషయంలో మీ ఆశీర్వాదాలు ఉన్నాయి. హ్యాపీ బర్త్ డే మై డ్యాడ్‌. మీరు ప్రతిరోజూ నాతోనే ఉంటే బాగుండనిపిస్తోంది’.. అని ప్రియాంక ఎంతో బాధాతృప్త హృదయంతో పోస్ట్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో పాట ఎంతో ప్రేమతో మమ్మీ కోసం మీరు పాడేవారని రాసుకుంది. 

 


ఈ పోస్టుకి నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. అందరు విషెష్ తెలుపుతూ ప్రియాంకకు సానుభూతిని తెలియజేస్తున్నారు. లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైక్ లు వచ్చాయి. ప్రియాంక ఆవేదనను అర్ధం చేసుకుని ఆమె అభిమానులు అదే రీతిలో స్పందించారు


మరింత సమాచారం తెలుసుకోండి: