బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ సినీ ట్రేడ్ వ‌ర్గాల‌కు ఒక్క‌సారిగాషాక్ ఇచ్చాడు. రంజాన్ ప‌ర్వ‌దినం నాటికి త‌న సినిమా విడుద‌ల కాద‌ని తేల్చి చెప్పాడు. గత కొన్నేళ్లుగా ప్రతి రంజాన్ ప‌ర్వ‌దినాన థియేట‌ర్‌ల‌లో త‌న సినిమా ఉండేలా స‌ల్మాన్ ఖాన్ ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే వ‌చ్చే ఏడాది రంజాన్ నాడు ఇన్‌షా అల్లాను రిలీజ్ చేస్తాన‌ని చాలా క్రిత‌మే చెప్పాడు. 

అయితే, వ‌చ్చే ఏడాది రంజాన్ నాటికి ఇన్‌షా అల్లా రాద‌ని స‌ల్మాన్ ఖాన్ తాజాగా ట్వీట‌ర్‌లో త‌న అభిమానుల‌కు తెలిపాడు. కానీ, అదే రోజున త‌న మ‌రో సినిమా థియేట‌ర్‌ల‌లో ఉంటుంద‌ని స‌ల్మాన్‌ఖాన్ చెప్పాడు. బాజీరావు మ‌స్తానీ, ప‌ద్మావ‌తి వంటి వ‌రుస విజ‌యాల‌తో బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా బ‌న్సాలీ ఇటీవ‌లె స‌ల్మాన్ ఖాన్‌తో ఇన్‌షా అల్లా అనే టైటిల్‌లో సినిమా షూటింగ్‌ను మొద‌లు పెట్టాడు.

56 ఏళ్ల స‌ల్మాన్‌ఖాన్‌కు జోడీగా26 ఏళ్ల ఆలియా భ‌ట్‌ను ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీ సెలెక్ట్ చేశాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ ఇప్ప‌టికే అంద‌రిలోనూ ఆస‌క్తి రేపింది. అయితే ఈ చిత్ర షూటింగ్ మ‌రింత‌గా ఆల‌స్యం కానున్న కార‌ణంగా ఈ సినిమాను రిలీజ్ చేయ‌లేన‌ని స‌ల్మాన్‌ చెప్పాడు. అదే రోజున ఇన్‌షా అల్లా కాకుండా త‌న మ‌రో సినిమా రిలీజ్ అవుతుంద‌ని చెప్పాడు. అయితే  ఆ సినిమా ఏమై ఉంటుందో అన్న‌ది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్స్‌గానే ఉంది.

కాగా, స‌ల్మాన్ ఖాన్ ఇన్ షా అల్లాతోపాటు ద‌బాంబ్ -3లోనూ న‌టిస్తున్నాడు. ఆ సినిమా ఈ ఏడాదే విడుల కానుంది. మ‌రి ఏ సినిమా రంజాన్ నాటికి రిలీజ్ చేస్తాడ‌న్న‌ది సస్పెన్స్‌లో ఉంచాడు స‌ల్మాన్‌. స‌ల్మాన్ ఖాన్‌, సంజ‌య్ లీలా బ‌న్సాలీది హిట్ కాంబినేష‌న్ అన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో కామూషీ, హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్ వంటి సినిమాలు వ‌చ్చాయి. ఆ త‌రువాత బాజీరావు మ‌స్తానీ సినిమా కూడా స‌ల్మాన్ ఖాన్‌, ఐశ్వ‌ర్య‌రాయ్ కాంబినేష‌న్‌లో డైరెక్ట్ చేసేందుకు సంజ‌య్ లీలా బ‌న్సాలీ ప్లాన్ చేసినా అది కుద‌ర‌లేదు. ఐశ్వ‌ర్య‌రాయ్‌, స‌ల్మాన్ ఖాన్ ఇద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పుకోవ‌డం, ఐశ్వ‌ర్య అభిషేక్ బ‌చ్చ‌న్‌ను పెళ్లిచేసుకోవ‌డం వంటి కార‌ణాల‌తో ఆ సినిమా కుద‌ర‌లేదు. దాదాపు ప‌దిహేనేళ్ల త‌రువాత అదే సినిమాను దీపికా ప‌దుకొనే, ర‌ణ్‌వీర్ సింగ్‌ల‌తో క‌లిసి తీశాడు. ఇలా చాలా ఏళ్ల త‌రువాత బ‌న్సాలీ, స‌ల్మాన్ ఖాన్ కాంబినేష‌న్ సెట్ట‌యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: