టాలీవుడ్ గీత రష్మిక ఎంత స్వీటో అంత హాట్. ఈ అమ్మడు చలో అంటూ సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటివరకూ ఆ పరుగు ఎక్కడా ఆపలేదు. ఆమెకు అందం ఉంది. సూపెపర్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. అన్నిటికీ మించి లక్కుంది. దాంతో టాలీవుడ్లో స్టార్ అలా  దూసుకుపోతోంది. రష్మిక ఇపుడు చేస్తున్న ప్రాజెక్ట్ ప్రెస్టేజియస్ దే. సూపర్ స్టార్ మహేష్ బాబు కు  జంటగా సరిలేరు నీకెవ్వరూ మూవీలో బ్యూటీగా కనిపిస్తోంది.


ఈ మధ్యనే విడుదల అయిన డియర్ కామ్రెడ్ మూవీ ఫెయిల్ కావడంతో రష్మిక ఒకింత నిరాశలో ఉందిట. హిట్ పెయిర్ అని చెప్పుకునే విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ఈ మూవీకి నెగిటివ్ రిజల్ట్ రావడంతో రష్మిక ఇప్పటికీ తేరుకోలేకపోతోందిట. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె ఇపుడు మాత్రం కొంత వేదాంతం కూడా వల్లిస్తోంది. సరే సినిమాలు హిట్లు ఫ్లాపులు ఎవరి చేతుల్లోనూ ఉండవు. అయితే హీరో విజయ్ తో మాత్రం తాను ఇకపైన కొన్నాళ్ళ పాటు నటించనని హాట్ స్టేట్మెంట్ ఒకటి రష్మిక ఇచ్చేసింది. ఎందుకు అంటే అది అంతే అంటోంది. గీతా గోవిందం తరువాత ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న రూమర్లు వెల్లువలా వచ్చాయి. అవి అలా ఉండగానే డియర్ కామ్రెడ్ లో మళ్ళీ జంట కట్టారు.


దాంతో అవి మరింతగా పెరిగి పెద్ద అయిపోయాయి. ఈ నేపధ్యంలో రష్మిక స్ట్రాంగ్  డెసిషన్ తీసుకుందిట. విజ‌య్ తో మరో రెండేళ్ల వరకూ మూవీ చేయకూడదని. ఆ విషయాన్ని ఆమె బోల్డ్ గా చెబుతూ విజ‌య్ తో బాగా విసిగిపోయానని, ఫ్రెష్ నెస్ కోరుకుంటున్నానని అంటోంది. సో రెండేళ్ల వరకైనా రూమర్లకు చెక్ పెట్టాలని తెలివిగా రష్మిక ఈ డెసిషన్ తీసుకుందని అంటున్నారు  


ఇదిలా ఉండగా రష్మిక ఇపుడు భీష్మ మూవీలో నితిన్ తో నటిస్తోంది. ఈ మూవీ తరువాత ఆమె కొత్తగా ఏమీ ఒప్పుకున్నట్లులేదు. మరి అల్లు అర్జున్ మూవీ ఒకటి ఉందని కూడా న్యూస్ అయితే వస్తోంది. అలాగే మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా తమ పెయిర్ గా రష్మికను అడుగుతున్నారని అంటున్నారు. మొత్తానికి విజయ్ తో మాత్రం చేయనని రష్మిక ఒట్టేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: