మన తెలుగు చిత్ర పరిశ్రమలో బోల్డ్ గా నటించే హీరోయిన్స్ చాలా తక్కువేనని చెప్పాలి. అలాంటిది ఆర్ ఎక్స్ 100 సినిమాతో వస్తూనే సంచలన విజయంతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ డం ని సొంతం చేసుకుంది. అంతేకాదు పాయల్ యాక్టింగ్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో మంచి పొజిషన్ కు వెళ్తుందని ఫిక్సైయ్యారు. అలాగే వెంకటేష్, రవితేజ.. వంటి స్టార్స్ సరసన ఛాన్స్ దక్కించుకుంది. ఇక తాజాగా విడుదలైన ఆర్డీఎక్స్ లవ్ సినిమా టీజర్ చూసిన తర్వాత అందరు రొమాంటిక్ హీరోయిన్ అంటే పాయల్ అని గట్టిగా ఫిక్సైపోయారు. 

మన తెలుగులో ఈమధ్య బోల్డ్ పేరుతో వరుసగా చాలా సినిమాలే వస్తున్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా కంప్లీట్ అడల్ట్ సినిమాగా ఆర్డీఎక్స్ లవ్ సినిమాని తెరకెక్కించారు. కంట్రోల్ యువర్ ఫీలింగ్స్, సేఫ్టీ, అపరిచితుడితో సెక్స్ చేశారా.. లాంటి డైలాగ్స్ వింటేనే సినిమా జానర్ ఏంటో, పాయల్ ఎలాంటి పాత్ర పోషించింది అన్న విషయం అర్థమతుంది. అందుకే ఇది చూసిన అందరు సెక్సీ హీరోయిన్ అని కొత్తగా పిలుచుకుంటున్నారు. అంతేకాదు ఇక ఇప్పటి నుంచి తెలుగులో ఇలాంటి బోల్డ్ సినిమా ఛాన్స్ లే వస్తాయి తప్ప, స్టార్ తో నటించే సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవచ్చునని ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. 

వెంకీమామ, డిస్కోరాజా సినిమాలే పాయల్ చేస్తున్న చివరి స్టార్ ప్రాజెక్టులు అవ్వొచ్చట. ఎందుకంటే ఇప్పటికే ఐటెంసాంగ్ చేసిన పాయల్, ఆర్డీఎక్స్ లవ్ టైపులో ఇంకొక్క సినిమా చేస్తే చాలు, పెద్ద హీరోల సినిమాలు ఆగిపోవడం ఖాయం. ఒక రకంగా పాయల్ కూడా స్టార్ హీరోస్ తో సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నట్టు లేదని తెలుస్తోంది. వాస్తవానికి టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోయిన్స్ కొదవను భర్తీ చేయడానికి పాయల్ కు ఆర్ఎక్స్100 రూపంలో మంచి అవకాశం దొరికింది. కానీ బోల్డ్ అంటూ ఆమె తన కెరీర్ ను మరో దారిలోకి తీసుకెళ్తోంది. క్రేజీ హీరోయిన్ అవుతుందనుకున్న పాయల్ కాస్తా హాట్ హీరోయిన్ గా మారిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: