బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా  అభిమానులను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మరో  భారీ యాక్షన్ చిత్రం సాహో. బాలీవుడ్‌ నటి  శ్రద్ధ కపూర్‌ హీరోయిన్ గా, భారీ తారాగణంతో, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా  టీజర్, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా సినిమా టాలీవుడ్ , బాలీవుడ్ రేంజ్ కాదు .. హాలీవుడ్ రేన్ సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు.

అందుకు తగ్గట్టే దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో సుమారు 10,000 థియేటర్ల పైగానే ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు లక్షల కోట్ల దొంగతనాన్ని కథగా మలచి సుజిత్ అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించాడు.  అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి పాత్రలో ప్రభాస్ ,  క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన ఆఫీసర్  అమృతా నాయర్‌ పాత్రలో శ్రద్దా తమన్నా నటనతో సినిమాని మరో లెవెల్ కి తీసుకోని వెళ్లారు. హీరో ప్రభాస్ ఎప్పటిలానే తన  నటనతో అదరగొట్టాడు.

ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలలో తనదైన నటన  చూపించాడు. ముఖ్యంగా రెండు షేడ్స్ లో అతడు అద్భుతంగా నటించాడు. శ్రద్దా సగటు అమ్మాయిలా కనిపిస్తూ… అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు మాదిరిగానే 'సాహో'లో కావాల్సినంత స్టఫ్ ఉంది. ప్రభాస్ నటన, లుక్స్ అదిరిపోయాయి. కొన్ని సన్నివేశాలలో అయితే హాలీవుడ్ హీరోను తలపిస్తాడు.  

తాజాగా కొద్దిసేపటి తమిళ సాహో చుసిన తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్  ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. యాక్షన్స్ సీన్స్ లో ప్రభాస్ కష్టం స్క్రీన్ పై చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పారు.  డైరెక్టర్ సుజిత్  రెండో సినిమాకే ఈ లెవెల్ లో సినిమా తీశారు అంటే నమ్మబుద్దికాలేదు అంటూ చెప్పాడు.  అలాగే ఇండియన్ సినిమా స్థాయిని పెంచే సినిమా సాహో అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.  నా జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదు అని చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: