టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల రెండేళ్ల క్రితం సినిమాలకు స్వస్తి పలికి, తాను స్థాపించిన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమవ్వడం జరిగింది. అంతేకాక కొన్నాళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పవన్ తన పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఓడిపోయినప్పటికీ తాను కానీ, తన పార్టీ కానీ, ఎల్లప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడి, వారికి తగురీతిన సేవలందించడమే తన ద్యేయమని, అలానే తన ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీని నడుపుతానని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో పవన్ తెలిపారు. 

ఇక అప్పటినుండి ప్రజాక్షేత్రం లోకి వెళ్లి, వారి సమస్యలపై తనవంతుగా పోరాటం చేస్తున్న పవన్, మళ్ళి అతి త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని గత కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. నిజానికి పవన్ గత సినిమా అజ్ఞాతవాసి చేసే సమయంలో, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సిందని, అయితే అప్పటికే రాజకీయంగా ముందుకు సాగాలని నిర్ణయించడంతో, ఆ సినిమా క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. ఇక మరొక రెండు రోజుల్లో పవన్, తన 48వ జన్మదినాన్ని జరుపుకోనున్న సందర్భంగా, ఇప్పటికే మెగా ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టిన రోజు సంబరాలు మొదలెట్టసారు. ఇక ఆ రోజున రక్తదానం, అన్నదానం వంటి పలు సామజిక కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు ఫ్యాన్స్. అయితే అదే రోజున తన పుట్టిన రోజుతో పాటు వినాయకచవితి పండుగ కూడా కావడంతో, 

తన కొత్త సినిమా గురించి పవన్ ఒక సంచలన ప్రకటన కూడా చేయనున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. అంతేకాక ఆ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందని, అలానే సినిమాని అజ్ఞాతవాసి నిర్మాతైన రాధాకృష్ణ, తన హారిక హాసిని సంస్థపైనే నిర్మించనున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ వార్తను తన బర్త్ డే నాడు ప్రకటించవచ్చని పవన్ భావించి కొంత గోప్యంగా ఉంచినప్పటికీ , అయన సన్నిహితులు కొందరు ఈ విషయాన్ని ముందుగానే మీడియాకు లీక్ చేసినట్లు సమాచారం. మరి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, ఎప్పటినుండో పవన్ నుండి సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్న ఆయన ఫ్యాన్స్ కు ఇది నిజంగా గొప్ప పండుగ వార్తే అని చెప్పాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: