శ్రీపిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం `#బాయ్స్` ఈరోజు ప్రారంభ‌మైంది. `ర‌థం` ఫేమ్ గీతానంద్‌, శ్రీహాన్‌, రోనిత్ రెడ్డి, సుజిత్‌, అన్షులా, జెన్నీ ఫ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సంజ‌య్ స్వ‌రూప్‌, మేల్కొటి, ఉత్తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. ద‌యానంద్ ద‌ర్శ‌కుడు. నేహాశ‌ర్మ నిర్మాత‌. ఈ సినిమా ముహూర్త‌పు సన్నివేశానికి కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ క్లాప్ కొట్టి, డైరెక్ట‌ర్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. `ర‌థం` డైరెక్ట‌ర్ రాజా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సుప్రియ‌, నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా పూజా కార్యక్ర‌మాల్లో పాల్గొని యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా... పాత చిత్రం బాయ్స్ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. మ‌రి ఈ చిత్రం అంత‌టి హిట్ సాధిస్తుందో లేదో వేచి చూడాలి. ఇక‌పోతే ఇందులో న‌టించే న‌టీన‌టులంద‌రూ కొత్త‌వారు వీరి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎలా అల‌రిస్తారో మ‌రి.
ద‌ర్శ‌కుడు ద‌యానంద్ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడిగా నా తొలిచిత్రం. న్యూ ఏజ్ యూత్‌ఫుల్ ల‌వ్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి టీమ్ కుదిరింది. క‌థ న‌చ్చగానే నిర్మాత‌లు వెంట‌నే సినిమాను చేయ‌డానికి అంగీక‌రించారు. వారికి నా థ్యాంక్స్‌`` అన్నారు. 


నిర్మాత నేహాశ‌ర్మ మాట్లాడుతూ - ``న్యూ ఏజ్ యూత్‌ఫుల్  ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మా బాయ్స్ సినిమా బాయ్స్ సినిమాను రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం. టాకీ పార్ట్ అంతా హైద‌రాబాద్‌లో ఉంటుంది. గోవాలో పాటల‌ను చిత్రీక‌రిస్తాం. సెప్టెంబ‌ర్ 4 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం`` అన్నారు. 


గీతానంద్‌, శ్రీహాన్‌, రోనిత్ రెడ్డి, సుజిత్‌, అన్షులా, జెన్నీ ఫ‌ర్, సంజ‌య్ స్వ‌రూప్‌, మేల్కొటి, ఉత్తేజ్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ:  వెంక‌ట్ ప్ర‌సాద్‌, ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌, మ్యూజిక్‌:  స్మ‌ర‌ణ్‌(RX 10 బ్యాగ్రౌండ్ స్కోరర్‌), కొరియోగ్ర‌ఫీ:  శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌, జావెద్‌, డిజైన‌ర్‌:  పి.శ్యామ్‌, పి.ఆర్‌.ఒ:  తేజ‌స్వి స‌జ్జ‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  బెక్కం ర‌వీంద‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌:  బాల‌చంద్ర‌, ప్రొడ్యూస‌ర్‌:  నేహాశ‌ర్మ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ద‌యానంద్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: