సుమారు ఏడాదిన్నర గ్యాప్ తరువాత అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠ పురములో’ వచ్చే సంక్రాంతికి రాబోతోంది. అనేక ఆలోచనలు చేసిన తరువాత బన్నీ అనేక మార్పులు చేర్పులు చేసిన త్రివిక్రమ్ కథలో నటిస్తున్నాడు. నాన్న సెంటిమెంట్ తో ఉండే ఈ మూవీ కథలో బన్నీ మధ్యతరగతి అబ్బాయిగా కనిపించబోతున్నాడు. 

అయితే ఈ లీకులకు భిన్నంగా లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీకి సంబంధించిన స్టిల్ లో బ్యాక్ గ్రౌండ్ లో బహుళ అంతస్తుల భవనం బయట పోష్  రోల్స్ రాయస్ లాంటి ఖరీదైన కారు కనిపిస్తోంది. అక్కడే సూటు వేసుకుని స్టూలు మీద కూర్చుని ఫ్యాట్ ను ఒక కాలుకు మడతపెట్టి బీడీ వెలిగిస్తున్న అల్లు అర్జున్ ను చూపెడుతూ ఇది  ‘అల వైకుంఠపురములో’ సినిమా ఫస్ట్ లుక్ అన్న సంకేతాలు త్రివిక్రమ్ ఇస్తున్నాడు. 

దీనితో ఈ స్టిల్ ను చూసినవారికి త్రివిక్రమ్ ఈ సారి మళ్ళీ అల్లు అర్జున్ తో పవన్ ‘అత్తారింటికి దారేది’ మూవీని మళ్ళీ చూపించబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అత్యంత ధనవంతురాలైన అత్త టబు ఇంటిలో బన్నీ ఎదో ఒక పనిచేస్తున్నట్లు ఈ స్టిల్ ను బట్టి అర్ధం అవుతుంది.  

దీనితో ఈ మూవీలో కూడ బన్నీని ఒక పనివాడిగా చూపించబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బన్నీ లాంటి స్టైలిష్ హీరోను స్టైలిష్ లుక్ లో చూపించకుండా ఇలా వెరైటీగా చూపించడంలో త్రివిక్రమ్ ఆలోచనలు ఏమిటి అన్న కోణంలో ప్రస్తుతం బన్నీ అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనితో బన్నీ అభిమానుల మధ్య కలకలం మొదలైంది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఇది అంతా అల్లు అర్జున్ అభిమానులను కన్ఫ్యూజ్ చేయడానికి త్రివిక్రమ్ ప్రయోగించిన పజిల్ అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: