పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు రచ్చ రచ్చ చేస్తున్నారు. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ చాలా విభిన్నంగా ఎవరు ఆలోచించని విధంగా ఆలోచిస్తూ నవత రాజకీయ నేతలకు యువతకు ఆదర్శంగా నిలుస్తూ ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్నారు. సినిమా చేస్తే కొన్ని కోట్లు వస్తాయని తెలిసినా కానీ జీవితంలో సినిమాలు చేయను తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితమని పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసినదే. ఎన్నికలలో పవన్ ఓటమితో చాలామంది షాక్ కి గురయ్యారు. అసెంబ్లీలో అడుగు పెడతారని భావించిన చాలామందికి పవన్ కళ్యాణ్ ఓటమి బాధకు గురి చేసింది. అయితే తనకి ఓటమి అనేది లెక్క కాదు యుద్ధం చేయడం మాత్రమే తనకి ఇష్టమని….సినిమాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదని ప్రజల తరఫున పోరాటం చేయడం కోసం అని ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది.


ఇంతగా పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేయడానికి కమిట్మెంట్ తీసుకున్న క్రమంలో పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జబర్దస్ తో గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే విషయం అందరికి తెలుసు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా కామెంట్స్ చేస్తే, వాళ్ళకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే హైపర్ ఆది, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో “పిలవకపోయిన పలుకుతాడు. అడగకపోయిన ఆదరిస్తాడు. అందుకే అందరికి నచ్చుతాడు. ఊహకందనోడు ఊపిరి ఉన్నంత వరకు మర్చిపోలేనోడు మన అందరి వాడు అందరికి అర్థం కాడు.” అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు


మరింత సమాచారం తెలుసుకోండి: