ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా శుక్రవారం రోజు విడుదలైంది. దాదాపు 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమాపై విడుదలకు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా విడుదలైన తరువాత సాహో ఆ అంచనాలను అందుకోలేకపోయింది. వీకెండ్ వరకు టికెట్స్ ముందుగానే బుక్ అవ్వటంతో నిన్నటివరకు ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. 
 
ఈరోజు వినాయకచవితి పండుగ సందర్భంగా సెలవు కావటంతో ఈరోజు కూడా కలెక్షన్లు బాగానే వచ్చే అవకాశం ఉంది. కానీ రేపటినుండి మాత్రం సాహో సినిమాకు కష్టమే అని తెలుస్తోంది. హైదరాబాద్ లాంటి మేజర్ ఏరియాలో ఒకటి రెండు థియేటర్లలో తప్ప మరెక్కడా సాహో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా జరగటం లేదు. దాదాపు అన్ని థియేటర్లలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. సెలవులు ఈరోజుతో పూర్తి అవుతూ ఉండటంతో రేపటినుండి సాహో ఏ మేరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. 
 
బాహుబలి, బాహుబలి 2 సినిమాల తరువాత ప్రభాస్ నటించిన సాహో సినిమా ప్రభాస్ అభిమానులకు నచ్చినప్పటికీ సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంలో మాత్రం విఫలమయింది. కథ, కథనంలోని లోపాలు, సినిమా నిడివి ఎక్కువ కావటం, పాటలు సినిమాకు మైనస్ గా మారాయి. సాహో సినిమా పవన్ కళ్యాణ్ ప్లాప్ సినిమా అఙాతవాసి సినిమాను పోలి ఉందనే ఆరోపణలు రావటం కూడా సినిమాకు మైనస్ గా మారింది. 
 
సాహో సినిమా నిర్మాతలు ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయని చెబుతున్నప్పటికీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ కలెక్షన్లు నిజం కాదని ప్రచారం చేస్తున్నారు. సాహో సినిమా ప్రపంచవ్యాప్తంగా 330 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫుల్ రన్లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: