అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ కుర్రకారుని తెగ ఊపేసింది ఇలియానా. రామ్ పోతినేని మొదటి సినిమా దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా హిట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ ఇలియానాతో చేయటానికి అప్పట్లో బాగా ఎగబడ్డారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది ఇలియానా.


టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఇలియానా సౌత్ మొత్తం వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది మంచి టైం ఇలియానాది సౌత్ ఇండస్ట్రీ లో నడుస్తున్నప్పుడు బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఇలియానాకి నిరాశ ఎదురైంది. చాలా సినిమాలు చేసినా గాని ఇలియానా కి మంచి పేరు మాత్రం బాలీవుడ్ రాకపోవడంతో ఎక్కువకాలం నిలబడలేకపోయింది. దీనితో టాలీవుడ్ దర్శకులు కూడా ఆమెని మరచిపోయారు. గత ఏడాది రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం మళ్ళీ సౌత్ లో పుంజుకునేందుకు ఇలియానా తన సర్కిల్స్ లో గట్టి ప్రయత్నాలే చేస్తోందట.


త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన నయనతార, తమన్నా లాంటి ఇలియానా జనరేషన్ బ్యూటీ లని వెతుకుతున్నారు. అయితే ఈ సినిమాలో నటించడానికి ఇలియానా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు సినిమా డైరెక్టర్ కొరటాల శివ తో చర్చలు జరిపినట్లు టాక్. డబ్బు కోసం కాకుండా అవకాశం కోసం సౌత్ లో మళ్లీ నిలదొక్కుకోవడం కోసం ఇలియానా గట్టిగా ఈ సినిమాలో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వినబడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: