బిగ్ బాస్ సీజన్ 3 రోజుకో విధమైన మలుపులతో మరింత ఆసక్తిగా ముందుకుపోతుంది. రోజుకొకరకమైన టాస్క్ తో ముందుకుసాగుతుంది. అలాగే ఇప్పటికే షో  సగం పూర్తీ కావడంతో హౌస్ మేట్స్ కూడా టైటిల్ కొట్టాలనే కసితో అందరూ చెలరేగిపోయి ఆడుతున్నారు. ఇక ఈ వారం విషయానికొస్తే ... ఈ వీక్ లో మొత్తం ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో శ్రీముఖి , అలీ , రవి ...సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా కనిపిస్తుండగా ... మహేష్ , రాహుల్ లలో ఎవరో ఒకరు ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. 

ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన దొంగలు దోచిన నగరం టాస్క్ ని హౌస్ మేట్స్ అందరూ కలిసి నానా రచ్చ చేసి రద్దు చేసేలా చేసారు. దీనితో ఈ టాస్క్ రద్దు కావడానికి  ముఖ్యకారకులుగా భావించి రాహుల్ , రవిలని బిగ్ బాస్ శిక్షించాడు. అలాగే వారిద్దరిని జైల్లో పెట్టి .. జైల్ ఆహారం మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో పోటీ పడే ముగ్గురు అభ్యర్ధులని , అలాగే పోటీ చేయడానికి అనర్హులుగా భావించే ముగ్గురు హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ కి చెప్పాలి అని చెప్పగా ... హౌస్ మేట్స్ అందరూ హిమజ , శ్రీముఖి , బాబా భాస్కర్ పేర్లని కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా ప్రకటించారు. అలాగే అనర్హులుగా రాహుల్ , రవి , శిల్పాల పేర్లు చెప్పారు. 

దీనితో అనర్హులైన ముగ్గురు  .... ముగ్గురు పోటీదారుల కోసం ఆడాలని చెప్పగా  ... శిల్పా హిమజ కోసం ...బాబా భాస్కర్ కోసం రాహుల్ ... శ్రీముఖి కోసం రవి ఆడారు.ఇక వీరికి ఇసుక టాస్క్ ఇవ్వగా ... ముగ్గురిలో ఈ వారంఇంటి కెప్టెన్ గా బాబా భాస్కర్ ఎంపికైయ్యాడు. అలాగే ఈ టాస్క్ సమయంలో పునర్నవి, అలీ మధ్య మరో రచ్చ జరిగింది. ఇక తాజాగా వచ్చిన ప్రోమోని ఒకసారి గమనిస్తే .... ఈ వారం ఇంటి కెప్టెన్ గా ఎన్నికైన బిగ్  బాస్ నవ్వుల రాజు బాబా భాస్కర్ హౌస్ మేట్స్ కి ఈ వారం రోజులపాటు తన కెప్టెన్సీ లో ఎలా ఉండాలో ..ఎలా ఉండకూడదో చెప్తున్నట్టు అర్థమౌతుంది. హౌస్ మేట్స్ అందరిని లివింగ్ రూమ్ లోని సోఫా లో కూర్చోబెట్టి ... మీరు కావాల్సినంత సేపు నిద్రపోండి ..కానీ కుక్కలు అరచినప్పుడు లేచి టీ తాగండి అని ..అలాగే మీకు ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ మాట్లాడండి ..బిగ్ బాస్ ఇచ్చిన శిక్షలు అనుభవించండి అని చెప్తున్నాడు. దీనికి హౌస్ మేట్స్ అందరూ పడి పడి నవ్వుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: