యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి, తొలి సినిమా నుండి ఇప్పటివరకు దర్శకుడిగా ఒక్క అపజయం కూడా లేకుండా సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. అంతేకాదు ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే, అది గోల్డెన్ ఛాన్స్ కాదు, ఏకంగా డైమండ్ ఛాన్స్ గా భావించేవారు ఎందరో ఉన్నారు. ఇక ఇటీవలి బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత రాజమౌళి పేరు దేశ దేశాల్లో విపరీతంగా మారుమ్రోగుతోంది. అందుకే తదుపరి ఆయన దర్శకత్వంలో రాబోయే ఆర్ఆర్ఆర్ మూవీపై తారా స్థాయిలో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఏదైనా సినిమాను పక్కాగా జడ్జి చేసి, అది ఎంతవరకు ఆడుతుంది అని చెప్పడంలో మంచి దిట్టగా పేరుగాంచిన రాజమౌళి, ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి కోసం తనవంతుగా కొంత సాయం అందించినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇటీవల ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, నెగటివ్ టాక్ మూటగట్టుకుని ముందుకు సాగుతుండడంతో సైరా నిర్మాత రామ్ చరణ్ సహా సినిమా యూనిట్ మొత్తానికి లోలోపల కొంత భయం ఏర్పడిందని అంటున్నారు. అందుకోసం రెండు రోజుల క్రితం, రాజమౌళిని కలిసిన నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, ఒక్కసారి సైరా సినిమా కాపీని వీక్షించమని కోరారట. 

ఇక నిన్న ఉదయం వారి ఆహ్వానం మేరకు సినిమాను చూసిన రాజమౌళి, సినిమా చాలా బాగా తెరకెక్కించారని యూనిట్ ని అభినందించడంతో పాటు, అక్కడక్కడా చిన్న చిన్న సర్దుబాట్లు చేయమని చెప్పారట. ఇక ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయాన్ని అటుంచితే, గతంలో కొందరు హీరోలు తమ సినిమాలను రిలీజ్ కు ముందు, పలువురు దర్శకులు, నిర్మాతలకు చూపించేవారని, అయితే అటువంటివి ఎక్కువగా వారి మధ్య స్నేహపూర్వకంగా జరుగుతుంటాయని, ఒకవేళ ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా నిజంగానే రాజమౌళి గారు సైరా వీక్షించి, అందులో కొద్దిపాటి మార్పులు చెప్పి ఉన్నట్లయితే అది సైరా సినిమాకు మంచే చేస్తుంది కదా అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: