మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లుకలకులు వచ్చాయని బుధవారం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కొన్ని పత్రికల్లోనూ జోరుగా వార్తలు వచ్చాయి. సహజంగానే సినిమా వార్తల పట్ల ఇంట్రస్టుతో సోషల్ మీడియాలో వదంతలు చెలరేగిపోయాయి. అందులోనూ గతంలో మా లో జరిగిన కొన్ని పరిణామాలతో ఈ వార్తకు ప్రాధాన్యం పెరిగిపోయింది.


మా అసోసియేషన్ లో లుకలుకలు వచ్చాయని.. హీరో రాజశేఖర్ ఆధ్వర్యంలో నరేష్ పై షోకాజ్ కు రంగం సిద్ధం అయ్యిందన్నది ఆ వార్తల సారాశం. రాజశేఖర్ వర్గం అంతా కలిసి నరేష్ కు షోకాజ్ నోటీసు ఇచ్చేశారని.. నరేష్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారని మరికొన్ని వార్తలు వచ్చేశాయి. అయితే ఇలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (మా) కు సంబంధించి సోష‌ల్ మీడియాలో విరివిగా వార్తలు రావడంతో దీనిపై `మా` కార్యవ‌ర్గం వివ‌ర‌ణ‌ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ వివరణ ఇలా ఉంది.


" మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) కార్య‌వ‌ర్గంలో భేదాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని, అధ్యక్షుడు న‌రేశ్‌కి రాజ‌శేఖ‌ర్ కార్యవ‌ర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు విన‌ప‌డుతున్నాయి. ఈ విష‌యం తెలిసిన `మా` కార్యనిర్వాహ‌క వర్గం ఈ వార్తల‌ను తీవ్రంగా ఖండించింది. ``ఓ అసోసియేష‌న్ అంటే.. చాలా స‌మ‌స్యలుంటాయి. వాటన్నింటినీపై అంద‌రూ చ‌ర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. `మా` వెల్ఫేర్‌కి సంబంధించి అత్యవ‌స‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్యలు గురించి మంగ‌ళ‌వారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జ‌రిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు సంబంధించి మీడియాకు తెలియ‌జేయాల్సిన వార్తలేవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియ‌జేస్తాం``అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కార్యవ‌ర్గం తెలియ‌జేసింది.


అయితే ఈ వివరణ అసమగ్రంగా కనిపిస్తోంది. అసలు నరేశ్ కు రాజశేఖర్ వర్గం షోకాజు నోటీసు ఇచ్చిందా లేదా అన్నదానిపై ఏమాత్రం వివరణ కనిపించలేదు. అంతే కాకుండా.. మాకు చాలా సమస్యలు ఉన్నాయి అని ఏకంగా మా అసోసియేషన్ ఒప్పుకున్నట్టయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: