మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్షేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రలో హీరోయిన్ నయనతార నటిస్తుండగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తున్నారు. ఇక వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయి పాత్రలో అనుష్క, రాజా పాండి గా విజయ్ సేతుపతి, అవుకు రాజుగా కన్నడ నటుడు సుదీప్, లక్ష్మి గా తమన్నా, వీరా రెడ్డిగా జగపతి బాబు నటిస్తున్నారు. 

ఇక ఈనెల 18న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకుంటున్న ఈ సినిమాపై తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక చిన్న ప్రత్యేక పాత్ర ఉందని, ఆ పాత్రకు గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకున్నారని కాసేపటి నుండి ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన పవర్ స్టార్, 

అన్నయ్య చిరంజీవి గారి కోరిక మేరకు ఆ చిన్న పాత్రలో నటించడం జరిగిందట. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఆ పాత్రలో పవన్ కేవలం కొన్ని క్షణాలు మాత్రమే కనపడనునట్లు సమాచారం. అయితే పవన్ నటించిన ఈ క్యారెక్టర్ విషయమై సైరా టీమ్ ఆ న్యూస్ బయటకు రాకుండా ఎంతో గోప్యంగా వ్యవహరించినప్పటికీ, సినిమాకు పనిచేసిన కొందరు, దానిని నేడు మీడియాకు లీక్ చేసినట్లు సమాచారం. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయినట్లయితే, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే పండగ అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: