కాగా గ్యాంగ్ లీడర్ విడుదలకు ముందు ఎలాంటి సందడి చేయలేకపోయింది. దాంతో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలకావడంతో భారీ మొత్తం లో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇక కల్లెక్షన్ల విషయానికి వస్తే నైజాం లో ఈ చిత్రం మొదటి రోజు 1.69కోట్ల షేర్ ను రాబట్టగా ఓవర్సీస్ లో ప్రీమియర్ల తో కలుపుకొని 350k డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఇంతకుముందు జెర్సీ మొదటి రోజు నైజాం లో 1.93 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో మొదటి రోజు 450k డాలర్ల ను రాబట్టింది.
అయితే వారాంతం కావడం అలాగే టాక్ కూడా బాగుండడం తో గ్యాంగ్ లీడర్ శని , ఆదివారాల్లో మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టుకునే అవకాశాలు వున్నాయి. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించాడు.ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించాడు.