టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి అల్లుడు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు, శివ మనసులో శృతి (ఎస్ఎమ్ఎస్) సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హీరోగా నటించిన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుని నటుడిగా మంచి పేరు సంపాదించిన సుధీర్, ఆ తరువాత నుండి పలు వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. నిజానికి మొదట సుధీర్ బాబు, సమంత మరియు నాగచైతన్యల కలయికలో వచ్చిన ఏం మాయ చేసావే సినిమాలో సమంత అన్నగా చిన్న క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. 

ఇక హీరోగా నటించిన ఎస్ఎమ్ఎస్ తరువాత, జె ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటించిన ప్రేమ కథా చిత్రం, మంచి హిట్ సాధించి సుధీర్ కు హీరోగా బాగా పేరు తెచ్చిపెట్టింది. అయితే అప్పటినుండి వరుసగా చేస్తున్న సినిమాలతో కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ అందుకోని సుధీర్, ఇటీవల ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన సమ్మోహనం, అలానే కొత్త దర్శకుడు ఇంద్రసేన తెరకెక్కించిన నన్ను దోచుకుందువటే సినిమాలతో రెండు వరుస హిట్స్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి అనే సినిమాలో హీరోగా ఆయన నటిస్తున్నారు. ఇకపోతే ఎప్పటికపుడు తన పర్సనల్ విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే సుధీర్, 

నేడు తన బ్యాట్రైడర్ కారుని వేరొకరి సాయం లేకుండా ఆయనొక్కరే రెండు చేతులతో బలంగా ముందుకు తోసుకెళ్తున్న వీడియోని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. నా ఫిట్ నెస్ ట్రైనర్ జాఫర్ అలీ, రోజు డైలీ వర్కౌట్స్ తో బోర్ కొడుతుంది అంటుంటే, నేడు ఈ విధంగా కొత్తగా ట్రై చేశాను అంటూ తన పోస్ట్ లో తెలిపారు సుధీర్. అయితే ఆ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు బాబోయ్ సుధీర్, మీరు సామాన్యులు కాదు అంటూ ఆయనపై ప్రశంశలు కురిపిస్తూ ఆ వీడియోని విపరీతంగా షేర్స్ మరియు లైక్స్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: