నేచుర‌ల్ స్టార్ నాని - విక్రమ్ కుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ గ్యాంగ్ లీడర్ మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గ‌ర ఆశించిన వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేదు. సినిమాకు ఓ మోస్త‌రు టాక్ వ‌చ్చింది. గ్యాంగ్ లీడ‌ర్ చుట్టూ ఐదుగురు ఆడ‌వాళ్లు, వారి మ‌ధ్య నాని... వాళ్లంద‌రికీ ఓ టార్గెట్‌. అత‌ని పేరు రేస‌ర్ దేవ్‌. క్లుప్తంగా క‌థ ఇది. సినిమాలో అన్ని ఉన్నా ఆర్టిస్టులు బాగా చేసినా క‌థ‌, క‌థ‌నం, ఆక‌ట్టుకోని పాట‌లు... గ్రిప్పింగ్‌గా లేని స‌న్నివేశాలు సినిమాకు మైనస్‌గా నిలిచాయి.


సినిమాలో అనూహ్య‌మైన మలుపులు లాంటివాటిని చిత్రంలో ఆశించ‌లేం. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ సీన్ కూడా రొటీన్‌గానే సాగింది. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి మ‌ళ్లీ రొటీన్ అయింది. దీనికి తోడు నాని గ‌త సినిమాల రిజ‌ల్ట్‌ను పోల్చుకుని సినిమాకు వెళితే అంత మంచి ఫీలింగ్ కూడా రాదు. దీంతో గ్యాంగ్ లీడ‌ర్ తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ 4.51 కోట్ల వాటాను వసూలు చేసింది.


ఇక ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికి అయినా గ్యాంగ్ లీడ‌ర్ మంచి వ‌సూళ్లు సాధిస్తుందేమో ?  చూడాలి. నాని గ‌త సినిమాలు రెండు దేవ‌దాస్‌, కృష్ణార్జున యుద్ధం ప్లాప్ అవ్వ‌డం, జెర్సీ క్లాస్ మూవీ కావ‌డంతో ఆ ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై ప‌డింది. ఇక గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది.


గ్యాంగ్ లీడ‌ర్ ఏరియా వైజ్ ఫ‌స్ట్ డే షేర్ (రూ.కోట్ల‌లో)
నైజాం - 1.67


సీడెడ్ - 0.51


నెల్లూరు - 0.15


కృష్ణా - 0.33


గుంటూరు - 0.46


వైజాగ్ - 0.61


ఈస్ట్ - 0.52


వెస్ట్ - 0.26
-------------------------------
ఏపీ + తెలంగాణ =  4.51
-------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: